చర్లపల్లి జైలులో గంజాయి బ్యాచ్​ లొల్లి

చర్లపల్లి జైలులో గంజాయి బ్యాచ్​ లొల్లి
  • నలుగురు ఖైదీలను అదుపులోకి తీసుకున్న సిబ్బంది

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చర్లపల్లి జైలులో కొందరు ఖైదీలు గంజాయి కోసం గొడవకు దిగారు. జైలు సిబ్బందిపైనా దాడి చేశారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా, గొడవకు దిగిన నలుగురు ఖైదీలను అధికారులు అదుపులోకి తీసుకొని వేరే బ్యారెక్స్‌‌‌‌లోకి తరలించారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ కొంతమంది అండర్‌‌‌‌‌‌‌‌ ట్రయల్‌‌‌‌ ఖైదీలను ఇటీవల చంచల్‌‌‌‌ గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అందులో గంజాయికి అడిక్ట్​ అయిన వారు కూడా ఉన్నారు. చర్లపల్లి జైలులో సాధారణ ఖైదీలతో వారిని రిమాండ్‌‌‌‌ చేశారు. గంజాయికి అలవాటుపడ్డ వారు తమకు గంజాయి కావాలని చాలాసార్లు జైలు సిబ్బందితో గొడవపడ్డారు. బ్యారక్‌‌‌‌లో ఉన్న మిగతా ఖైదీలతోనూ వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ ఘటనపై చర్లపల్లి పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేసి విచారణ జరుపుతున్నారు.