
ఇనూక్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్ సిటీ ప్రయాణికుల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను హైదరాబాద్లో బుధవారం లాంచ్చేసింది. వీటిలో ఇనూక్ ఈవీ ప్రో, ఇనూక్ ఈవీ మాగ్నా, ఇనూక్ ఈవీ స్మార్ట్, ఇనూక్ ఈవీ వెర్వ్ వేరియంట్లు ఉన్నాయి. ధరలు రూ.89,000 నుంచి రూ.99,000 వరకు ఉంటాయి. అత్యాధునిక ఫీచర్లు, స్థిరత్వం, సౌలభ్యం, భద్రత వంటివి వీటి ప్రత్యేకతలు.