పడవల్లో పాక్ చొరబాట్లు.. ఇండియన్ నేవీ హైఅలర్ట్

పడవల్లో పాక్ చొరబాట్లు.. ఇండియన్ నేవీ హైఅలర్ట్

దేశ సరిహద్దు నుంచి ఇండియాలోకి చొరబడేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని భారత ఇంటలిజెన్స్- నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇంటలిజెన్స్ సర్వీస్ సూచనతో.. భారత ఆర్మీ, ఇండియన్ నేవీ బలగాలు, ఇతర భద్రతా విభాగాలు.. అటు సరిహద్దు భూభాగం, జలమార్గాల్లో హై అలర్ట్ అయ్యాయి. గస్తీని పెంచాయి.

భారత్ లో చొరబాట్లే లక్ష్యంగా.. పాకిస్థాన్ ఆర్మీ… స్పెషల్ సర్వీస్ గ్రూప్ -SSG పేరుతో ఉగ్రవాద మూకలకు శిక్షణ ఇస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఇప్పటికే 100 ఎస్ఎస్జీ బలగాలను మోహరించినట్టు సమాచారం ఉంది. భూభాగం నుంచే కాకుండా.. అటు జలమార్గంనుంచి కూడా భారత్ లోకి చొరబడేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలకు తాజాగా సమాచారం వచ్చింది. గల్ఫ్ ఆఫ్ కచ్, సిర్ క్రీక్ జల మార్గాల్లో… చిన్న చిన్న బోట్లతో… ఇండియా టెరిటరీలోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని ఇంటలిజెన్స్ హెచ్చరించింది. దీంతో.. ఆ జల మార్గాల్లో ఇండియన్ నేవీ ప్రత్యేకంగా నిఘా పెట్టింది. విజిలెన్స్, పెట్రోలింగ్ బలగాలతో నిరంతరం పహారా కాస్తోంది. తేడా వస్తే… దాడులు చేసేందుకు సిద్ధమైనట్టు ఇండియన్ నేవీ తెలిపింది.