రాష్ట్రంలో కరోనాపై హైకోర్టు విచారణ

రాష్ట్రంలో కరోనాపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై హైకోర్టు విచారించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీజీపీ మహేందర్ రెడ్డి, హెల్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు. కొత్త ఏడాది వేడుకల్లో రూల్స్ బ్రేక్ చేసిన వారిపై 907 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు డీజీపీ. టైంకి మించి వేడుకలు చేసుకున్న వారిపై 263 కేసులు బుక్ చేశామన్నారు. పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు 644 కేసులు నమోదయినట్లు నివేదికలో తెలిపారు. మాస్కులు పెట్టుకోనివారికి ఫైన్ లు వేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 10 వరకు సభలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వడంలేదని తెలిపారు. జనం గుమిగూడకుండా పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అటు కరోనా పరిస్థితులపై కోర్టుకు వివరించారు డీహెచ్. అయితే నివేదికలపై మాట్లాడిన పిటిషనర్ తరుపు న్యాయవాదులు... కోర్టులు, విద్యా సంస్థలు ఆన్ లైన్ లో నిర్వహించాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కరోనా పరిస్థితులపై విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది కోర్టు.

 

ఇవి కూడా చదవండి


ఏపీ మంత్రి నానికి రాంగోపాల్ వర్మ ప్రశ్నల వర్షం

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో 12మందికి కరోనా

ర్యాగింగ్ చేసిన మెడికోల సస్పెన్షన్