
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ మార్కెట్ లో ఓటీటీ(OTT)ల హవా నడుస్తోంది. ఆడియన్స్ కూడా కొత్త కొత్త కంటెంట్ కోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కంటెంట్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీలు వెబ్ సిరీస్ లు అనగానే లవ్ అండ్ ఎమోషనల్ కాకండా హారర్, క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ సిరీస్ లపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్య మేకర్స్ కూడా ఇలాంటి కంటెంట్ ను ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలా ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి(Inspector Rishi).
- ALSO READ | Allu Arjun Wax statue: గంగోత్రి వచ్చిన రోజే మైనపు విగ్రహం.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర(Naveen Chandra) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను దర్శకురాలు జేఎస్ నందిని(JS Nandini) తెరకెక్కించారు. టీజర్ ట్రైలర్ తో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ నేడు(మార్చి 29) అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం పది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ 30 నుంచి 60 నిమిషాల మధ్యలో ఉంది. క్షణక్షణం హారర్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ సిరీస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. మరి ఈ సిరీస్ కు ఆడియన్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ఇక ఇన్స్పెక్టర్ రిషి కథ విషయానికి వస్తే.. తింకాడు అనే అటవీ ప్రాంతంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అదే అడవిలో సంచరించే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలు చేస్తుందని ఆ ఊరి జనం నమ్ముతారు. అత్యంత భయానకంగా జరిగే ఈ వరుస హత్యల కేసు ఇన్వెస్టిగేషన్ సీబీ సీఐడీ చేతికి వెళ్తుంది. అందులో భాగంగానే ఆ ఊరికి కొత్తగా ఇన్స్పెక్టర్ రిషి వచ్చి కేసు విచారణ మొదలుపెడతాడు. మరి ఇన్స్పెక్టర్ రిషి విచారణ ఎలా జరిగింది? ఆ విచారణలో రిషి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? నిజంగా ఆ హత్యలకు ఆ దెయ్యమేనా? అనే విషయాలను ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.