యోగాసనాలు వేసినందుకు.. చంపేస్తామంటూ బెదిరింపులు

యోగాసనాలు వేసినందుకు.. చంపేస్తామంటూ బెదిరింపులు

ఇన్‌స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెనర్సర్ అర్చన మక్వానా అమృత్ సర్ లోని గోల్డన్ టెంపుల్ ప్రాంతంలో యోగా చేసినందుకు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను బెదిరిస్తున్నారు. యోగా చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో సిక్కుల పవిత్ర స్థలం గోల్డెన్ టెంపుల్ ఉన్న ఫోస్టులను సోషల్ మీడియాలో పెట్టింది. ఆ పోస్టులు వైరల్ కావడంతో శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ అర్చన మక్వానా సిక్కు కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసిందని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాదు ఆమె పోస్ట్ చేసిన వీడియోపై క్షమాపణలు చెప్పినప్పటికీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు  చంపుతానంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె తెలిపింది.

తాను చేసిన యోగా పోస్టులు ఇతరులు తప్పుగా చిత్రీకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 2024 జూన్ 21న ప్రపంచ యోగా డే సందర్భంగా అర్చన శశాంకాసనం వేసింది. ఆ ఫోటోలో ఆమె కాళ్లు గోల్డెన్ టెంపుల్ వైపు ఉన్నాయి. ఇంటర్నెట్ లో ఈ పోస్ట్ వైరలైంది. దీంతో సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆమెపై విమర్శలు వచ్చాయి. అది కావాలని చేయలేదని.. ఎవరి మతపరమైన భావాలను కించపరడం తన ఉద్దేశ్యం కాదని అర్చన క్షమాపణలు కూడా చెప్పింది. అర్చన మక్వానా ఇన్ స్టాగ్రామ్ లో లక్షా 40వేల ఫాలోవర్స్ ఉన్నారు. ట్రావెల్, ఫుడ్, ఫ్యాషన్ కంటెంట్ మీద వీడియోలు చేస్తుంది.