
ట్రెండింగ్లో ఉన్న విషయం గురించి తమ ఒపీనియన్ని ట్విట్టర్ లేదా ఫేస్బుక్లో టెక్స్ట్ మెసేజ్ పోస్ట్లు పెడుతుంటారు చాలామంది. ఇకనుంచి ఇన్స్టాగ్రామ్లో కూడా టెక్స్ట్ మెసేజ్ల్ని పోస్ట్ చేయొచ్చు. త్వరలోనే ఇన్స్టాగ్రామ్లో ‘నోట్స్’ అనే కొత్త ఫీచర్ రానుంది. అయితే మెసేజ్లోని అక్షరాలు 60 క్యారెక్టర్స్ మించకూడదు. డైరెక్ట్ మెసెంజర్ చాట్ సెక్షన్లో ఈ ఫీచర్ కనిపిస్తుంది. సెర్చ్ బార్ కింద యూజర్ల డిస్ప్లే పిక్చర్ పక్కన ‘లీవ్ ఎ నోట్’ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే డైరెక్ట్ మెసెంజర్ చాట్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ స్టేటస్ లెక్కనే ఈ మెసేజ్లు కూడా ఒక రోజు తర్వాత కనిపించవు. అంతేకాదు ఫాలోవర్స్ ఈ మెసేజ్లకు డైరెక్ట్ మెసెంజర్ చాట్ నుంచి రిప్లై ఇవ్వొచ్చు కూడా. కామెంట్ సెక్షన్లో అసభ్యకర ఫొటోలు, వీడియోలు పెట్టకుండా చూసే ఫీచర్ కూడా త్వరలో తేనున్నట్టు చెప్పింది ఇన్స్టాగ్రామ్.