ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో రెస్ట్రిక్ట్ ఫీచర్

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో రెస్ట్రిక్ట్ ఫీచర్

ఫేస్‌‌బుక్‌‌కు చెందిన ఫొటో షేరింగ్‌‌ యాప్‌‌ ‘ఇన్‌‌స్టాగ్రామ్‌‌’ కొత్త ఫీచర్‌‌‌‌ను తీసుకొచ్చింది. ‘రెస్ట్రిక్ట్‌‌’ పేరుతో రూపొందిన ఈ ఫీచర్‌‌‌‌ ద్వారా ఎవరైనా అభ్యంతరకర కామెంట్లు చేస్తే, వాళ్ల కామెంట్లు కనిపించకుండా రెస్ట్రిక్ట్‌‌ చేయొచ్చు. ఇన్‌‌స్టాలో పోస్ట్‌‌ చేసిన స్టోరీలకు కామెంట్లు తప్పుగా అనిపిస్తే, ఆ అకౌంటును ప్రైవసీ ట్యాబ్‌‌ ద్వారా లెఫ్ట్‌‌ స్వైప్‌‌ చేస్తే చాలు. ఆ అకౌంట్‌‌ నుంచి వచ్చే కామెంట్స్‌‌ వాళ్లకు తప్ప ఇంకెవరికీ కనిపించవు. ఒకవేళ యూజర్లు ఆ కామెంట్‌‌ను చూడాలనుకుంటే ‘వ్యూ కామెంట్‌‌’ పై ట్యాప్‌‌ చేయాలి. ఆ తర్వాత ఆ కామెంట్‌‌ అందరికీ కనిపించాలన్నా, డిలీట్‌‌ చేయాలన్నా, అలాగే వదిలేయాలన్నా వేర్వేరు ఆప్షన్లు సెలెక్ట్‌‌ చేసుకోవచ్చు. రెస్ట్రిక్ట్‌‌ చేసిన అకౌంట్‌‌ నుంచి డైరెక్ట్‌‌ మెసేజ్‌‌లు వస్తే ఆటోమేటిగ్గా ‘మూవ్‌‌ రిక్వెస్ట్‌‌’లోకి వెళ్తాయి. వాటికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లు రావు. ఒకవేళ ఆ కామెంట్స్‌‌ చూడాలనుకుంటే ‘అన్‌‌రెస్ట్రిక్ట్‌‌’  సెలెక్ట్‌‌ చేసుకోవాలి. గతనెలలో కూడా ఇన్‌‌స్టాగ్రామ్‌‌ కొత్త ఫీచర్‌‌‌‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం పద్దెనిమిదేళ్ల లోపు యూజర్లు కొన్ని అకౌంట్లను ఫాలో అయ్యే అవకాశం ఉండదు. అంటే కొన్ని సోషల్‌‌ మీడియా సెలబ్రిటీలు/ఇన్‌‌ఫ్లుయెన్సర్ల అకౌంట్లను ఫాలో అయ్యే చాన్స్‌‌ లేదు