ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2026–-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: అప్రెంటిస్.
మొత్తం ఖాళీలు: 1010.
విభాగాల వారీగా ఖాళీలు
ఫ్రెషర్: కార్పెంటర్ 40, ఎలక్ట్రిషియన్ 40, ఫిట్టర్ 80, మెషినిస్ట్ 40, పెయింటర్ 40, వెల్డర్ 80, ఎంఎల్టీ – రేడియాలజీ 5, ఎంఎల్టీ – పాథాలజీ 5.
ఎక్స్ ఐటీఐ: కార్పెంటర్ 50, ఎలక్ట్రిషియన్ 160, ఫిట్టర్ 180, మెషినిస్ట్ 50, పెయింటర్ 50, వెల్డర్ 180, పీఏఎస్ఏఏ 10.
ఎలిజిబిలిటీ
ఫ్రెషర్స్: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఎల్టీ పోస్టులకు ఇంటర్మీడియట్ - ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అర్హత ఉండాలి.
ఎక్స్ ఐటీఐ: 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 2026, సెప్టెంబర్ 07 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోసడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
ALSO READ : డిగ్రీ చదువుతున్న అమ్మాయిలకు.. 30 వేల స్కాలర్‌షిప్..వెంటనే అప్లయ్ చేసుకోండిలా !
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 8.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 100,- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 7.
సెలెక్షన్ ప్రాసెస్: ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ pb.icf.gov.inను సందర్శించండి.
