
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్ రెగ్యులర్, వొకేషనల్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపు గడువు నవంబర్ 30తోనే ముగిసింది. అయితే.. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి మరో 5 రోజుల పాటు బోర్డు ఛాన్స్ ఇచ్చింది.
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ శుక్రవారం (డిసెంబర్ 1న) ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులకు ఆలస్య రుసుం లేకుండా డిసెంబర్ 5 వరకు.. రూ. 1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించవచ్చని చెప్పారు.