ప్రాక్టీస్​ మేక్స్​ మ్యాథ్స్​ పర్​ఫెక్ట్​

ప్రాక్టీస్​ మేక్స్​ మ్యాథ్స్​ పర్​ఫెక్ట్​

ఫెక్ట్​‘గణితం’ ఈ పేరు వినగానే కొంతమంది విద్యార్థు ల్లో ఉత్సాహం మరికొంత మందిలో తీవ్ర ఒత్తిడి కనిపిస్తుం ది. అర్థమైతే వంద శాతం మార్కులు..లేదంటే గట్టెక్కడం కష్టమే!.. ఇది సాధారణంగా గణితంపై విద్యార్థు ల్లో ఉండే అభిప్రాయం. ఇంటర్మీడియట్ లో నే కాక ఎంసెట్ , జేఈఈ వంటి పోటీపరీక్షల్లో నెగ్గా లంటే మ్యాథ్స్​ మార్కులు కీలకం. బట్టీ విధానంలో చదివితే మ్యాథ్స్​ పరీక్ష నెగ్గడం కష్టం . దీనికి ప్రాక్టీస్ చాలా ముఖ్యం . నిరంతరం ఫార్ములాస్ ను గుర్తుం చుకుంటూ సాధన చేస్తే మ్యాథ్స్​ అంత ఈజీ సబ్జెక్ట్ ఉండదు. ఇంటర్ తర్వాత ఇంజినీరిం గ్ లో ఏ బ్రాంచ్ లో చేరినా మ్యాథ్స్​ది కీలక పాత్ర కాబట్టి కేవలం ఇంటర్ పరీక్షల దృష్టిలో నే కాకుండా దీర్ఘ దృష్టితో ప్రాక్టీస్ చేయడం ద్వారా మ్యాథ్స్​పై పట్టు పెంచుకోవచ్చు.

ఇంటర్‍ మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూపు వారికి మ్యాథమెటిక్స్–1A, 1B అనే రెండు సబ్జెక్టులుంటాయి. ప్రతి సబ్జెక్టులకు 75 మార్కులు ఉంటాయి. వందశాతం మార్కులు సాధించగలిగే సబ్జెక్టు ఏదైనా ఉందంటే అది మ్యాథమెటిక్స్ మాత్రమే. కాబట్టి ఇంటర్‍ బోర్డు వారు ఇచ్చిన బ్లూ ప్రింట్‍లో చాప్టర్లు మార్కుల ప్రాధాన్యత(వెయిటేజి) ఆధారంగా చక్కని ప్రణాళిక వేసుకొని చదవడం వల్ల ఇందులో వందశాతం మార్కులు పొందవచ్చు. ఇందుకుగాను ఏ చాప్టర్‍కు అధిక  ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ మోడల్స్ ముందుగా సాధన చేయాలి? వంటి సందేహాలకు సమాధానాలు, ప్రిపరేషన్‍ టిప్స్ మీ కోసం..

ప్రిపరేషన్‍ టిప్స్

మ్యాథమెటిక్స్ –1A మొత్తం 97 మార్కులకు (చాయిస్‍ ప్రశ్నలు  కలుపుకొని)  పేపర్‍ ఉంటుంది. ఇందులో రాయవలసింది 75 మార్కులకు మాత్రమే. దీని ప్రకారం దీర్ఘ సమాధాన ప్రశ్నలు 7 మార్కులు, స్వల్ప సమాధాన ప్రశ్నలు 4 మార్కులు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 2 మార్కులకు ఉంటాయి. మాత్రికలు, ఫంక్షన్స్, మ్యాథమెటికల్‍ ఇండక్షన్‍, మల్టిప్లికేషన్‍ ఆఫ్‍ వెక్టార్స్, ట్రిగనామెట్రీలో ట్రాన్స్‌‌ ఫర్మేషన్స్, ప్రాపర్టీస్‍ ఆఫ్‍ ట్రయాంగిల్స్ వంటి అధ్యాయాల నుంచి 7 మార్కుల ప్రశ్నలు 7 వస్తాయి. వీటిలో జవాబులు రాయవలసింది 5 ప్రశ్నలకే కాబట్టి ఈ చాప్టర్లను బాగా సాధన చేయడం వల్ల 35 మార్కులు సులువుగా పొందవచ్చు. సమయం ఉండి చాయిస్‍ ప్రశ్నలు రాసే వారికి సదవకాశం ఉంటుంది. అంటే మొదట రాసిన 5 ప్రశ్నల్లో ఏదైనా సమాధానం తప్పయినా చాయిస్‍ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా ఉంటే వాటి మార్కులనే పరిగణిస్తారు. నాలుగు మార్కుల ప్రశ్నల్లో కూడా 7 ప్రశ్నలు ఉం టాయి. దీనిలోనూ రాయాల్సిన సమా ధానాలు 5 మాత్రమే. ఇందులోనూ చాయిస్‍ ప్రశ్నల్లో అధిక మార్కులు వస్తే వాటినే వేస్తారు. కాబట్టి ప్రతి సెక్షన్‍లో చాయిస్‍ ప్రశ్నలు తెలిస్తే ఖచ్చితంగా రాయాలి. మంచి మార్కులు సాధించ డానికి ఇది  ఒక రకమైన టెక్నిక్‍. 20 మా ర్కులకు మొత్తం 10 అతిస్వల్ప సమా ధాన ప్రశ్నలుంటాయి. దీనిలో ఎటువంటి చాయిస్‍ ఉండదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో గమనించి వాటిని  చద వాలి. 75/75 మార్కులు రావాలంటే రెండు మార్కుల ప్రశ్నలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.  ఇంపార్టెంట్ టాపిక్స్ రివిజన్ చేయాలి.

ఈ క్రింది ఇమేజ్ లో కనపడే ప్రశ్నాపత్రం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మ్యాథ్స్-1A వెయిటేజి

అధ్యాయం                     వెయిటేజి            ఫంక్షన్స్     11 (7 + 2 + 2 )

మ్యాథమెటికల్‍ ఇండక్షన్‍                 7

మ్యాట్రిక్స్         22(7 + 7 + 2 + 2+4)

అడిషన్‍ ఆఫ్‍ వెక్టార్స్      8(4 + 2 + 2)

మల్టిప్లికేషన్‍ ఆఫ్‍ వెక్టార్స్ 13(7 + 4 + 2  )

ట్రిగనామెట్రిక్‍ రేషియోస్‍ అండ్‍ ఐడెంటీస్‍ 8(4 + 2 + 2)

ట్రాన్స్‌ ఫర్మేషన్స్                            7

ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్                  4

ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్‍ ఫంక్షన్‍          4

హైపర్‍బోలిక్‍ ఫంక్షన్స్                     2

ప్రాపర్టీస్‍ ఆఫ్‍ ట్రయాంగిల్స్  11 (7 + 4)

మ్యాథ్స్​–1B  వెయిటేజి

అధ్యాయం                     వెయిటేజి            లోకస్​        4 (4)

ట్రాన్స్​ఫర్మేషన్​ ఆఫ్​ యాక్సిస్​     4 (4)

స్ట్రెయిట్​ లైన్​              15 (7+4+2+2)

పెయిర్​ ఆఫ్​ స్ట్రెయిట్​ లైన్స్​   14 (7+7)

3డీ–కోఆర్డినేట్స్​                       2 (2)

డైరెక్షన్​ కొసైన్స్​ & డైరెక్షన్ రేషియోస్​ 7 (7)

ది ప్లేన్​                                   2 (2)

లిమిట్స్​ & కంటిన్యుటీ       8 (4+2+2)

డిఫరెన్షియేషన్​          15 (7+4+2+2)

ఎర్రర్స్​–అప్రాక్సిమేషన్స్​              2 (2)

టాన్జన్ట్​ & నార్మల్​              11 (7+4)

రేట్​ మెజర్​                              4 (4)

రోల్స్​ & లెగ్రాన్జిస్​ థీరమ్స్​          2 (2)

మాక్సిమా & మినిమా   7 (7)

మ్యాట్రిక్స్ అనే చాప్టర్‍లో నుంచి గరిష్టంగా 22 మార్కులకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చాప్టర్‍ను ముందుగా ప్రాక్టీస్‍ చేయాలి. ఇందులో అన్ని రకాల మెథడ్స్ ను సాధించాలి. ఒక 7 మార్కుల ప్రశ్న, ఒక నాలుగు మార్కుల ప్రశ్న, రెండు  2మార్కుల  ప్రశ్నలు వస్తాయి.