పరీక్షల టెన్షన్ తో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య

V6 Velugu Posted on Mar 03, 2020

మలక్ పేట(హైదరాబాద్), వెలుగు: ఎగ్జామ్స్ టెన్షన్ తట్టుకోలేక ఓ ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన తర్వాత తన రూమ్​లోకి వెళ్లి కిటికీకి చీరతో ఉరేసుకున్నాడు. హైదరాబాద్ లోని సైదాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పూసలబస్తీలో నివాసం ఉండే లక్ష్మీనారాయణ, కవిత దంపతుల కొడుకు భరత్(19) డీడీ కాలనీలోని శ్రీ చైతన్య కాలేజీలో కిందటేడాది ఇంటర్ పూర్తిచేశాడు. మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఈసారి రాసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు.  వెంటనే హాస్పిటల్​కు తరలించగా భరత్ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇంటర్ ఎగ్జామ్స్ నేపథ్యంలోనే టెన్షన్, మానసిక ఒత్తిడి కారణంగా భరత్ ఉరి వేసుకున్నాడని తండ్రి లక్ష్మినారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tagged Malakpet, Exam fear, inter student suicide attempt

Latest Videos

Subscribe Now

More News