ఆయిల్ పామ్‌‌లో అంతర్‌‌‌‌ పంటల సాగు : వెంకట్‌‌రావు

ఆయిల్ పామ్‌‌లో అంతర్‌‌‌‌ పంటల సాగు : వెంకట్‌‌రావు

సూర్యాపేట, వెలుగు:  ఆయిల్ ఫామ్‌‌లో అంతర్ పంటల సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ వెంకట్‌‌రావు సూచించారు. మంగళవారం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరిలో రైతులు ఎన్‌‌. రాఘవరెడ్డి, దుబ్బాక ప్రభాకర్‌‌‌‌ రెడ్డి  తమ ఆయిల్ పామ్‌‌ తోటలో అంతర్‌‌ పంటలగా సాగుచేసిన మిర్చి, కంది పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా హార్టికల్చర్‌‌‌‌ శాఖ ద్వారా అందుతున్న సబ్సిడీ, బిందు సేద్యం పరికరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అయిల్ పామ్‌‌ పంట వేసిన నాలుగో సంవత్సరంలో దిగుబడి మొదలవుతుందని, 30 ఏండ్ల వరకు ప్రతినెలా స్థిరమైన ఆదాయం వస్తుందని చెప్పారు.  జిల్లాలో పతంజలి కంపెనీ ద్వారా మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు.  

ఈ తోటల్లో అంతర్‌‌ పంటలుగాకూరగాయలు, మిర్చి, వేరుశనగ, కంది , అరటి, బొప్పాయి లాంటి పంటలతో పాటు అనుబంధంగా  పాడి పరిశ్రమ, కోళ్లు, గొర్రెల పెంపకం కూడా చేపట్టవచ్చన్నారు. కలెక్టర్ వెంట ఉద్యానవన, పట్టు పరిశ్రమల జిల్లా అధికారి  శ్రీధర్, పతంజలి పామాయిల్ కంపెనీ డీజీఎం యాదగిరి, హార్టికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ జగన్, పతంజలి సిబ్బంది హరీశ్ ,సుధాకర్, రైతులు ఉన్నారు.