మారటోరియం వడ్డీ పై వడ్డీ మాఫీ.. బ్యాంకర్ల అసంతృప్తి

మారటోరియం వడ్డీ పై వడ్డీ మాఫీ.. బ్యాంకర్ల అసంతృప్తి

అనవసర భారమంటోన్న లెండర్లు

ఖర్చులు పెరుగుతాయని ఆందోళన

బ్యాలెన్స్ షీట్లపై మరింత ఒత్తిడి

ముంబై: మారటోరియం కాలంలో లోన్లపై వడ్డీపై వడ్డీని ప్రభుత్వం మాఫీ చేయడంపై ఇండియన్ బ్యాంకర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎకానమీకి బూస్టప్ ఇవ్వకుండా లెండర్లకు అనవసరమైన పనిని ప్రభుత్వం పెడుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌‌లో మారటోరియం కాలంలో రూ.2 కోట్ల వరకున్న లోన్లకు వడ్డీపై వడ్డీ వేయడాన్ని మాఫీ చేస్తామని చెప్పింది.  ప్రభుత్వమే ఈ ఖర్చును భరిస్తుందని అఫిడవిట్‌‌లో పేర్కొంది. వడ్డీపై వడ్డీ మాఫీ చేయడంతో కేంద్రంపై  రూ.6 లక్షల కోట్ల వరకు భారం పడుతుందని అనలిస్ట్‌‌లు చెప్పారు. బ్యాంక్‌‌లు ఇప్పటికే 120 బిలియన్ డాలర్లకుపైగా మొండిబకాయిలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనా వైరస్‌‌తో డిమాండ్ పడిపోయింది. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న బ్యాలెన్స్ షీట్లపై మరింత భారం పెట్టినట్టు అవుతుందని బ్యాంకర్లంటున్నారు. అంతేకాక బ్యాంక్‌‌లు కూడా లక్షల కొద్దీ లోన్లను తిరిగి లెక్కించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇదే స్కీమ్‌‌ను అగ్రికల్చరల్‌‌ లోన్లకు తేవాలంటే.. కేంద్రం నుంచి విడుదలయ్యే ఫండ్స్ కోసం కనీసం తొమ్మిది నుంచి 24 నెలలు వేచి చూడాల్సి ఉంటుందని ఇద్దరు బ్యాంకర్లు చెప్పారు.  ప్రభుత్వం నుంచి మనీని వెనక్కి తెచ్చుకోవడం చాలా పెద్ద భారమైన పని అని ఇండియన్ షాడో బ్యాంక్‌‌లకు చెందిన ఒక సీనియర్ బ్యాంకర్‌‌‌‌ అన్నారు. చాలా పెద్ద పని ఉంటుందని, చివరికి ఎవరూ సంతోషంగా ఉండరు, ప్రభుత్వంపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నిరాకరించారు. ‘బ్యాంక్‌‌ల లీగల్ కాస్ట్‌‌లు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ బ్యాంక్‌‌లకు కేంద్ర సపోర్ట్ ఉంటుంది కానీ ప్రైవేట్ బ్యాంక్‌‌ల పరిస్థితి అలా కాదు. లాభం కోసం చూసుకోవాల్సి ఉంటుంది. భిన్నమైన కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ కాలిక్యులేషన్స్‌‌ను ప్రభుత్వం సవాలు చేయొచ్చు’ అని ఒక లాయర్ అన్నారు. మాఫీ అనేది ఇండియాలో లెండింగ్ పద్ధతిని మారుస్తుందని, బారోవర్స్‌‌కు ఇతర రూపాల్లో సాయం చేయాలని సబ్సిడీలు ఇవ్వడం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ చేపట్టడం వంటివి చేయాలని బ్యాంక్‌‌లంటున్నాయి.