
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటలకు మొదలైన ఎగ్జామ్స్ మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అధికారులు సెంటర్లలోకి అనుమతించలేదు.ఈసారి 9 లక్షల 7 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 14 వందల 43 కేంద్రాలు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. 25 వేల మంది ఇన్విజిలేటర్లు.. 50 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఇంటర్ కు 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఇంటర్ బోర్డు చరిత్రలోనే ఫస్ట్ టైం... ఫస్టియర్ పేపర్లకు సెకండియర్ లో ఇంప్రూవ్ మెంట్ రాసుకునే అవకాశం కల్పించారు అధికారులు.
మరిన్ని వార్తల కోసం