V6 News

గొల్లమాడలో ఇంటర్‌‌‌‌ స్టూడెంట్స్ సూసైడ్‌‌‌‌

గొల్లమాడలో ఇంటర్‌‌‌‌ స్టూడెంట్స్ సూసైడ్‌‌‌‌
  • నిర్మల్‌‌‌‌ జిల్లా నర్సాపూర్ (జి) మండలం గొల్లమాడలో విషాదం

నర్సాపూర్(జి), వెలుగు : ఎగ్జామ్‌‌‌‌లో ఫెయిల్‌‌‌‌ అయ్యానన్న మనస్తాపంతో ఓ ఇంటర్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్‌‌‌‌ జిల్లా నర్సాపూర్ (జి) మండలం గొల్లమాడలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన గొల్ల శివాజీ, రజిత దంపతుల కుమారుడు మణివర్ధన్‌‌‌‌ (17) నిర్మల్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ కాలేజీలో ఇంటర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ చదువుతున్నాడు. ఇటీవల ఎగ్జామ్స్‌‌‌‌ రాయగా.. ఆదివారం వచ్చిన ఫలితాల్లో.. రెండు సబ్జె్క్టుల్లో ఫెయిల్‌‌‌‌ అయ్యాడు.

దీంతో మనస్తాపం చెందిన మణివర్ధన్ శుక్రవారం తోటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన స్టూడెంట్‌‌‌‌ తోట పక్కన చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేశ్‌‌‌‌ తెలిపారు.

షాద్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : ఇంటర్‌‌‌‌ ఫెయిల్‌‌‌‌ అయ్యానన్న మనస్తాపంతో ఓ స్టూడెంట్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌‌‌‌నగర్‌‌‌‌ మండలం దూసకల్‌‌‌‌ గ్రామానికి చెందిన అభియాదవ్‌‌‌‌ (17) ఇటీవల ఇంటర్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ఇయర్‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌ రాశాడు. ఆదివారం రిజల్ట్‌‌‌‌ రాగా.. రెండ్‌‌‌‌ సబ్జెక్టుల్లో ఫెయిల్‌‌‌‌ అయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.