విద్యార్థులకు న్యాయం జరగాలి

విద్యార్థులకు న్యాయం జరగాలి

తాజాగా ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాల్లో మునుపెన్నడూ లేని విధంగా 51 శాతం విద్యార్థులు ఫెయిల్ కావడం దిగ్భ్రాంతి కలిగించింది. ఫలితాలు ప్రకటించాక అయోమయానికి గురైన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అందర్నీ బాధకు గురిచేసింది. సిలబస్ పూర్తి కాకుండానే, అనేక అవాంతరాల మధ్య నిర్వహించిన ఫస్టియర్ పరీక్షల మూల్యాంకనంలో కూడా ఎన్నో అవకతవకలు జరిగినట్టుగా అనిపిస్తోంది. అన్ని సబ్జెక్టులలో ప్రతిభ కనబర్చిన మెజారిటీ విద్యార్థులు గణితంలో మాత్రమే ఫెయిల్ కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఫెయిలయిన విద్యార్థులకు కనీసం సప్లిమెంటరీ పరీక్షలు కూడా లేవని తాజాగా బోర్డు అధికారులు ప్రకటించడం మరీ దారుణం. సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఇంకా ప్రకటించనందున ఫస్టియర్ ఫెయిలయిన విద్యార్థులందరికీ వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహిస్తేనే బాగుంటుంది. ముrఖ్యంగా తాజా ఫలితాల్లో ఏర్పడ్డ సాంకేతిక లోపాలను సవరించి, ఒక్క సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థులందరికీ ఉచితంగా రివాల్యుయేషన్ చేసి వారికి న్యాయం చెయ్యాల్సిన అవసరం ఉంది.
-పసునూరి శ్రీనివాస్, మెట్ పల్లి, జగిత్యాల జిల్లా.