వచ్చే నెల 30 వరకు ఇంటర్నేషనల్‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌ బంద్‌‌

వచ్చే నెల 30 వరకు ఇంటర్నేషనల్‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌ బంద్‌‌

ప్రకటించిన డీజీసీఏ

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌‌‌‌ ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌పై విధించిన నిషేధాన్ని నవంబర్‌‌‌‌‌‌‌‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సివిల్‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌ (డీజీసీఏ) బుధవారం ప్రకటించింది. కార్గో, సెలెక్ట్‌‌‌‌ రూట్స్‌‌‌‌లో ప్రత్యేకంగా నడుపుతున్న ఫ్లైట్లపై మాత్రం నిషేధం ఉండదని చెప్పింది. కాంపిటెంట్‌‌‌‌ అథారిటీ ద్వారా కేస్‌‌‌‌ టూ కేస్‌‌‌‌ బేసిస్‌‌‌‌లో, ఎంచుకున్న మార్గాల్లో ఫ్లైట్లకు అనుమతిస్తున్నట్లు చెప్పింది. యూరప్‌‌‌‌ దేశాల్లో కరోనా వైరస్‌‌‌‌ మరోసారి విజృంభిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 23న కేంద్రం ఫ్లైట్లపై నిషేధం విధించింది. ఆ తర్వాత డొమెస్టిక్‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌కు పర్మిషన్‌‌‌‌ ఇచ్చింది. వైరస్‌‌‌‌ ప్రభావం తగ్గకపోవడంతో ఇంటర్నేషనల్‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌పై పెట్టిన నిషేధాన్ని పొడిగిస్తూ వచ్చింది. కొన్ని ప్రత్యేక రూట్స్‌‌‌‌లో వందే భారత్‌‌‌‌ ఫ్లైట్లను నడిపింది.

For More News..

కొత్త సెక్రటేరియట్‌ పనులు దక్కించుకున్న ‘షాపూర్​జీ -పల్లొంజీ’

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, కానిస్టేబుల్

వనభోజనాల్లో విషాదం.. ఈతకు పోయి ఆరుగురు మృతి