జూన్​ నెలాఖరులోగా ఇంటర్నేషనల్​ ఫ్లైట్స్

జూన్​ నెలాఖరులోగా ఇంటర్నేషనల్​ ఫ్లైట్స్

న్యూఢిల్లీ/ముంబై: జూన్​ మూడో వారం లేదా చివరి వారం నుంచి ఇంటర్నేషనల్ ​ఫ్లైట్​సర్వీసెస్ ​ప్రారంభించే అవకాశం ఉందని సివిల్​ఏవియేషన్​ మినిస్టర్​ హర్దీప్ ​సింగ్ ​పూరి చెప్పారు. ఆరోగ్య సేతు అప్లికేషన్‌‌‌‌ లో గ్రీన్​స్టేటస్​ఉన్న డొమెస్టిక్​ఎయిర్​ ప్యాసింజర్లను క్వారంటైన్‌‌‌‌లో ఎందుకు ఉంచాలో అర్థం కావట్లేదన్నారు. ‘పరిస్థితులు మెరుగుపడితే ఆగస్టు లేదా సెప్టెంబర్​ వరకు వెయిట్ చేయడం ఎందుకు? అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్నీ  రెడీగా ఉన్న తర్వాత జూన్​ మధ్య నుంచి జులై చివరి వరకు ఎప్పుడైనా స్టార్ట్​ చేయచ్చు’ అని అన్నారు.

‘ఆరోగ్య సేతు’ తప్పనిసరి కాదు

ఫ్లైట్‌‌‌‌లో ప్రయాణించేందుకు ఆరోగ్య సేతు యాప్​ ​తప్పనిసరి కాదని ఢిల్లీ ఎయిర్​పోర్ట్ అధికారులు తెలిపారు. ప్యాసింజర్లు సెల్ఫ్ ​డిక్లరేషన్​ ఫారం ఇవ్వాల్సి ఉంటుందని, థర్మల్​ స్క్రీనింగ్ తప్పకుండా చేయించుకోవాలన్నారు. వాష్​రూమ్స్, గాలిని శుభ్రపరిచేందుకు స్పెషల్​ శానిటేషన్ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఫుడ్​ అండ్ ​బేవరేజెస్ ​ప్రాంతాలలో తక్కువ సిబ్బంది ఉంటారని చెప్పారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ లో మార్చి 25  నుంచి ఫ్లైట్ల రాకపోకలను నిలిపేశారు.

‘రేపట్నుంచి మా రాష్ట్రంలో సర్వీసులుండవ్​’

సోమవారం నుంచి విమాన సర్వీసులు  నడపడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మహారాష్ట్ర సర్కార్​  చెప్పింది.  ఈ నెల 31 వరకు లాక్​డౌన్​ అమలులో ఉన్నందు వల్ల అప్పటివరకు ఫ్లైట్​ ఆపరేషన్లు ఉండవని సర్కార్​ క్లారిటీ ఇచ్చింది. ఎయిర్​ ట్రావెల్​కు సంబంధించి స్టాండర్డ్​​ ఆపరేటింగ్​ ప్రోటోకాల్స్​ (ఎస్​ఓపీ) పై నిర్ణయం తీసుకోవడానికి తమకు కొంత సమయం అవసరమని సర్కార్​ భావిస్తోంది.

లాక్ డౌన్ ఎఫెక్ట్.స్మార్ట్ ఫోన్ గేమింగ్ కు మరింత జోష్