ఇయ్యాల ఇంటర్నేషనల్ మైండ్, బాడీ వెల్‌నెస్ డే

ఇయ్యాల ఇంటర్నేషనల్ మైండ్, బాడీ వెల్‌నెస్ డే

జీవితంలో పని చేయడం ఎంత ముఖ్యమో.. అందుకు తగ్గ శారీరమ శ్రమ, మానసిక శ్రమను అదుపులో ఉంచడం, వాటి వల్ల వచ్చే భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. లేదంటో అనారోగ్యం, ఒత్తిడి, ఆందోళనతో పాటు తదితర సంబంధిత సమస్యలతో మనం నిత్యం పోరాటం చేయాల్సిందే. వీటిని గనక అధిగమించకపోతే అవి మన ఆరోగ్యంపైనే గాక, మానసికంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ రోజు ఇంటర్నేషనల్ మైండ్-, బాడీ వెల్‌నెస్ డే సందర్భంగా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో మీకు సహాయపడే 5 యోగా ఆసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనులోమ్ విలోమ్

ఇది యోగాలో ఒక నిర్దిష్టకరమైన ప్రాణాయామం లేదా శ్వాసను నియంత్రితంచే ప్రక్రియ. ఇది ఎలా చేయాలంటే.. ముందుగా ఒక ముక్కు రంధ్రాన్ని మూసి, ఆ తర్వాత ఊపిరి పీల్చుకునేటప్పుడు మరొక ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచాలి. ఇదే ప్రక్రియను రివర్స్ లోనూ చేయాలి. ఇలా చేయడం వలన మీ నాడీ వ్యవస్థకు మెరుగ్గా పనిచేయడమేగాక, కాలక్రమేణా ఒత్తిడిని తట్టుకునే శక్తిని మరింత మెరుగుపరుచుకోవచ్చు.

భుజంగాసనం

ఇది హఠా యోగాలో వెనుకకు వంగి చేసే ఆసనం. ముందుగా మీ కడుపును నేలకు ఆనకుండా​ఫ్లాట్‌గా పడుకోవాలి. శరీరం పై భాగాన్ని ఎత్తి, వాలుగా చేతులను భూమికి ఆన్చి ఉండాలి. ఈ విధంగా చేస్తే ఒత్తిడిని సులభంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

బలాసన

ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో ఈ బలాసనం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ భంగిమలో మీ మోకాళ్లను మడిచి నేలకు ఆనించి, మీ ఛాతీని నేలకు సమాంతరంగా ఉంచాలి. ఆ తర్వాత మీ చేతులను పైకి ముందుకు చాచి, నేలపై ఉంచాలి. దాంతో పాటు నుదుటి భాగాన్ని కింద ఆనేలా ఆసనం వేయాలి. ఈ బలాసనం కనీసం 10 నిమిషాల పాటు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వృక్షాసనం

వృక్షాసన అనేది ఒక అధునాతన పర్వత భంగిమ. ఇందులో భాగంగా ముందు ఒక కాలును నేలపై ఉంచి, సపోర్టింగ్ గా మరొక కాలును ఈ కాలు తొడ పైన ఉంచాలి. దాంతో పాటు చేతులను పైకి పైకి వందనం చేస్తున్నట్టు నిలబడాలి. ఇదే వృక్షాసనం. ఇది శరీరం సమతుల్యతతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. ఇది మన కాళ్ల బ్యాలెన్సింగ్ కండరాలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది.

 

శవాసనా

మీరు ఏ భంగిమను చేసేందుకు ఆసక్తి లేనప్పటికీ ఈ సనాన్ని మాత్రం తప్పక వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది అత్యంత ఈజీగా చేసే ప్రక్రియ. దాంతో పాటు ఎక్కువ ఫలితాన్నిచ్చే భంగిమ కూడా. అందుకోసం మీరు చేయాల్సింది ముందుగా మీ కళ్ళు మూసుకుని నేలపై పడుకోవడమే. ఈ చిన్న ఆసనం మీ ఒత్తిడి స్థాయిలలో పెద్ద మార్పులు తీసుకువస్తాయని నిపుణులు స్పష్టం చేస్తు్న్నారు.