అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగా ఎందుకు చేయాలి.. ఈ సారి థీమ్ ఏంటంటే..

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగా ఎందుకు చేయాలి.. ఈ సారి థీమ్ ఏంటంటే..

అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) అనేది 2015 నుంచి ఏటా జూన్ 21న జరుపుకునే వార్షిక ఆచారం. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో యోగా చేస్తూ, దానిపై అవగాహనను పెంచుతూ ఉండడం ఈ రోజు ప్రత్యేకత. ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ తేదీని.. సెప్టెంబర్ 27, 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యోగా దినోత్సవాన్ని (IDY) ప్రతిపాదించారు . యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఉనికి కాపాడుతుంది, ఇది భారతదేశానికి బహుమతి లాంటిదని ఆయన కొనియాడారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 థీమ్ ఏమిటి?

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 థీమ్ యోగా ఫర్ హ్యుమానిటీ. దీని ప్రకారం యోగా వివిధ శైలులు శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం లేదా విశ్రాంతిని మిళితం చేస్తాయన్నమాట.

యోగా వల్ల కలిగే ప్రయోజనాలు..

మెరుగైన బలం, సమతుల్యత, శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా అనేక ప్రయోజనాలనిస్తుంది. అంతే కాదు ఒత్తిడిని, ఆందోళనను, నిరాశను తగ్గించేందుకు, మెరుగైన నిద్రకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా..

బలమైన కండరాల కోసం

కండరాల బలోపేతం చేయడానికి యోగా సహాయపడుతుంది. యోగ భంగిమలతో సమతుల్యతను మెరుగుపరుస్తుంది.

ఒత్తిడి తగ్గేందుకు

మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉండడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా సహాయపడుతుంది.

మెరుగైన నిద్రకు

యోగా శరీరానికి, మనస్సుకు విశ్రాంతిని ఇస్తుంది, ఫలితంగా నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

శక్తి  పెరుగుదలకు

ప్రసరణను మెరుగుపరచడం, అలసటను తగ్గించడం ద్వారా శక్తి స్థాయిలను పెంచడానికి యోగా సహాయపడుతుంది.

 బరువు తగ్గడానికి

కేలరీలను బర్న్ చేయడం, జీవక్రియను మెరుగుపరచడం వంటి వాడికి యోగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి కూడా యోగా సహాయపడుతుంది.

మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకు

ఆందోళన, నిరాశ, ఒత్తిడిని తగ్గించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుంది.