
జనగామ అర్బన్, వెలుగు: అంతర్రాష్ట్ర దొంగలను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్జిల్లా వర్ధమాన్నగర్కు చెందిన నందకిశోర్ సుఖ్చంద్కాక్రే ఈజీగా డబ్బు సంపాదించేందుకు లారీలను చోరీ చేసి అమ్ముతున్నాడు. ఈ క్రమంలో గత నెల మూడో వారంలో జనగామ మండలం వడ్లకొండ వద్ద నయారా పెట్రోల్‌బంకు వద్ద పార్క్చేసిన లారీని నందకిశోర్ చోరీ చేసి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సల్మాన్ మన్సూరీకి రూ. 2 లక్షలకు అమ్మాడు. వడ్లకొండకు చెందిన ఓనర్ గొరిగే మహేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మంగళవారం ఉదయం 10.30 గంటలకు నందకిషోర్, సల్మాన్పెంబర్తికి వచ్చారు. అక్కడి పెట్రోల్‌బంకు వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్, జనగామ సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్ఐలు భరత్, చెన్నకేశవులు, కానిస్టేబుల్స్ ను వరంగల్ సీపీ అభినందించిన్టటు జనగామ ఏసీపీ చేతన్ నితిన్ తెలిపారు.