గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల జోరు

గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల జోరు

న్యూఢిల్లీ : జులై నెలలో గోల్డ్‌‌‌‌ ఈటీఎఫ్‌ లలో పెట్టుబడులు ఏకంగా 86 శాతం పెరిగి రూ. 921 కోట్లకు చేరాయి. మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో పోర్ట్‌‌‌‌ఫోలియోలో గోల్డ్‌‌‌‌ ఈటీఎఫ్‌ లు చేర్చుకునేందుకు ఇన్వెస్టర్ లు ఇష్టపడుతున్నారు. దీంతో ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో గోల్డ్‌‌‌‌ ఈటీఎఫ్‌ లలో పెట్టుబడులు రూ.4,452 కోట్లకు పెరిగాయి. అసోసియే షన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌‌‌‌ ఇన్‌ ఇండియా (యాంఫి ) ఈ డేటా రిలీజ్‌ చేసింది. జూన్‌ 2020లో గోల్డ్‌‌‌‌ ఈటీఎఫ్‌ లలో పెట్టు బడులు రూ. 494 కోట్లే. ఆ తర్వాత నెలలో ఇవి భారీగా పెరిగాయి. గోల్డ్‌‌‌‌ ఈటీఎఫ్‌ ల ఎసెట్స్‌‌‌‌ అండర్‌ మేనేజ్‌ మెంట్‌ కూడా 19 శాతం పెరిగి రూ. 12,941 కోట్లకు చేరినట్లు డేటా చెబుతోం ది. ఏప్రిల్‌ లో రూ.731 కోట్లు, మే లో రూ. 815 కోట్లను గోల్డ్‌‌‌‌ ఈటీఎఫ్‌ లలో ఇన్వెస్టర్ లు వెచ్చించనట్లు పేర్కొంది. డాలర్‌ బలహీనంగా ఉండటంతో బంగారం ధరలు ఊపందు కుంటున్నాయని, దీనికి అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌ వార్‌ కూడా తోడైందని మార్నిం గ్‌ స్టా ర్‌ ఇండియా అసోసియే ట్‌ డైరెక్టర్‌ హిమాం శు శ్రీవాస్తవ అభిప్రాయపడుతున్నారు. ప్రధాన ఎకానమీలన్నీ కోవిడ్‌ దెబ్బకు రెసెషన్‌ పాలవడంతో, ఊహించి నట్లు గానే గోల్డ్‌‌‌‌ ధరలు జోరందుకున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలలో అనిశ్చి త పరిస్థితులు నెలకొన్పప్పుడు బంగారంలో పెట్టు బడులు సాధారణంగానే పెరుగుతాయన్నారు.

81% తగ్గిన గోల్డ్‌ దిగుమతులు

గోల్డ్‌‌  దిగుమతులు ఈ ఏడాది ఏప్రిల్‌ –జులై మధ్య కాలంలో ఏకంగా 81.22 శాతం తగ్గాయి. కరోనా సంక్షోభంతో గోల్డ్‌‌కు డిమాం డ్‌ పడిపోయిన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌ –జులై టైమ్‌‌లో బంగారం దిగుమతుల విలువ రూ. 91,440 కోట్లు (13.14 బిలియన్‌ డాలర్లు)గా ఉండగా, ఈ ఏడాది ఇదే టైమ్‌‌లో ఈ దిగుమతుల విలువ రూ. 18,590 కోట్లు (2.4 బిలియన్‌ డాలర్లు)గా ఉంది. కాగా, దిగుమతులు పెరిగే కొద్దీ దేశ కరెం ట్‌ అకౌంట్‌ డెఫిసి ట్‌ (సీఏడీ) ఎక్కువవుతుంది.