రికార్డు స్థాయిలో సిప్​లు

రికార్డు స్థాయిలో సిప్​లు
  • భారీగా పెరిగిన డెట్​ఫండ్స్​ఔట్​ఫ్లోలు
  • రూ.2,678 కోట్లకు చేరిన స్మాల్​క్యాప్​ ఇన్​ఫ్లోలు
  • రూ.2,001 కోట్లకు చేరిన మిడ్​ క్యాప్ ​ఫండ్స్​
  • తగ్గిన ఈక్విటీ ఎంఎఫ్​ ఇన్వెస్ట్​మెంట్లు

న్యూఢిల్లీ: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్ల (సిప్​ల) విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌లోకి ఇన్వెస్ట్​మెంట్లు ఈ ఏడాది ఆగస్టులో రికార్డు స్థాయిలో పెరిగాయి. సిప్​ రూట్​ద్వారా ఇన్వెస్టర్లు ఆగస్టులో రికార్డు స్థాయిలో రూ.15,813 కోట్లను గుమ్మరించారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఇవి మరింత పెరిగాయి. ఈక్విటీ,  హైబ్రిడ్ పథకాల్లో  పెట్టుబడుల విలువ ఆగస్టు చివరి నాటికి 12.30 కోట్ల పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోల్లో రూ.24.38 లక్షల కోట్లుగా ఉంది. 

అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో పడిపోయాయి. మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్,  స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్​లో మాత్రం ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలు పెరుగుతూనే ఉన్నాయి.  లార్జ్ క్యాప్ ఫండ్స్​కు   ఔట్‌‌‌‌‌‌‌‌ఫ్లోలు పెరిగాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చే ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలు సెప్టెంబరులో 30.4శాతం తగ్గాయి. 

“మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 4 కోట్ల మంది పెట్టుబడిదారుల మార్కును సాధించింది.  వీటి​ ద్వారా ఈక్విటీ మార్కెట్లలోకి రిటైల్ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. సెప్టెంబరులో సిస్టమాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​ (సిప్) ద్వారా రూ. 16,042.06 కోట్లు రావడమే ఇందుకు నిదర్శనం. ఇంత మొత్తం రావడం ఇదే మొదటిసారి. మొత్తం ఏయూఎంలో దీని వాటా 21శాతం పెరిగింది " అని ఆంఫీ సీఈఓ ఎన్​ఎస్​ వెంకటేష్ అన్నారు.

ఆరు కొత్త ఫండ్స్​

“ఈక్విటీ- ఆధారిత ఫండ్స్​కు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో నెట్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలు కొనసాగాయి. ఇవి వరుసగా 31వ నెల కూడా పెరిగాయి.  గత ఏడాది ఇన్​ఫ్లోల విలువ రూ.14,091 కోట్లు కాగా, ఈసారి రూ.20,245.26 కోట్లు వచ్చాయి. ఈక్విటీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ నుంచి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఆరు కొత్త ఫండ్స్​ వచ్చాయి. ఇవి రూ. 2,503 కోట్లను సేకరించాయి" అని మార్నింగ్‌‌‌‌‌‌‌‌ స్టార్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఎనలిస్ట్​ మెల్విన్ శాంటారిటా అన్నారు. ఈక్విటీ అసెట్ క్లాస్‌‌‌‌‌‌‌‌లో సెక్టోరల్/థీమాటిక్ ఫండ్‌‌‌‌‌‌‌‌లకు ఈ నెలలో అత్యధికంగా రూ.3,146.8 కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలు వచ్చాయి. 

డెట్ ఫండ్స్ కేటగిరీలో ఔట్​ఫ్లోలు గణనీయంగా పెరిగాయి. స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఫండ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలు రూ.2,678 కోట్లుగా ఉన్నాయి. మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఫండ్స్ రూ.2,001 కోట్లుగా ఉన్నాయి.   సిప్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోల విలువ రూ.16,402 కోట్లు ఉంది. గత నెల 30 నాటికి మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ అసెట్ అండర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ (ఏయూఎం) విలువ రూ.46.58 లక్షల కోట్లకు చేరింది. 

స్మాల్-క్యాప్,  మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ రెండింటిలోనూ నెట్​ఫ్లోలు  పోల్చితే తగ్గాయి.  ప్రాఫిట్‌‌‌‌ బుకింగ్స్​తో పాటు ఈ విభాగాలలో కొన్నింటిలో పెరిగిన వాల్యుయేషన్లపై ఆందోళనలు ఈ పరిస్థితికి కారణం.