
భారతీయ ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. 61 శాతం మంది పార్టిసిపెంట్లు ఈ విషయాన్ని వెల్లడించారు. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసమని 49 శాతం మంది, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసమని 31 శాతం మంది మోతీలాల్ సర్వేలో తెలిపారు. ఇంకా లాంగ్‌టెర్మ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. 85 శాతం మంది మూడు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగిస్తుండగా, 13 శాతం మంది 1–3 సంవత్సరాలు, 2 శాతం మంది మాత్రమే ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలం పెట్టుబడిగా ఉంచుతున్నారు.
పెట్టుబడి స్టైల్ విషయంలో, 57 శాతం మంది సిప్‌లు, లంప్సమ్ (పెద్ద మొత్తంలో ఒకేసారి) ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇష్టపడుతున్నారు. 26 శాతం మంది కేవలం సిప్‌లపై ఆధారపడుతుండగా, 17 శాతం లంప్సమ్ పెట్టుబడికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సమాచారం కోసం ఇన్వెస్టర్లు ప్రధానంగా ఫైనాన్షియల్ వెబ్‌సైట్లు, పత్రికలు, సోషల్ మీడియా, టెలివిజన్ వంటి వనరులను ఉపయోగిస్తున్నారు.