IPO News: మెయిన్‌బోర్డ్ ఐపీవో కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. గ్రేమార్కెట్లో దూకుడు..

IPO News: మెయిన్‌బోర్డ్ ఐపీవో కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. గ్రేమార్కెట్లో దూకుడు..

Prostarm Info Systems IPO: సుదీర్ఘకాలం బ్రేక్ తీసుకున్న తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. గడచిన కొన్ని రోజులుగా ఐపీవోల లిస్టింగ్స్ జరుగుతుండగా.. మార్కెట్ల ప్రతికూలతల్లో కూడా ఇన్వెస్టర్లకు ఇవి కాసుల పంట కురిపిస్తు్న్నాయి. దీంతో మళ్లీ 2024 నాటి జోరు మెుదలవుతుందేమో అనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రొస్టెమ్ ఇన్ఫో సిస్టమ్స్ కంపెనీ ఐపీవో గురించి. మెయిన్ బోర్డ్ కేటగిరీ కింద వస్తున్న ఐపీవో ఏకకాలంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టింగ్ కానుంది. నేడు కంపెనీ ఐపీవో సబ్ స్ర్కిప్షన్ కోసం స్టార్ట్ అవ్వగా ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఐపీవోలో పెట్టుబడి కోసం రిటైల్ ఇన్వెస్టర్లు, ఎన్ఐఐలు ఎక్కువ ఆసక్తిని కనసబరుస్తున్నారని తేలింది. 

ALSO READ | Jio Financial: అంబానీకి సెబీ గ్రీన్ సిగ్నల్.. మ్యూచువల్ ఫండ్ బిజినెస్ షురూ..

వాస్తవానికి కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.168 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం కోటి 60 లక్షల తాజా ఈక్విటీ షేర్లను సైతం కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.95 నుంచి రూ.105గా ప్రకటించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 142 షేర్లుగా నిర్ణయించటంతో ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో పాల్గొనటానికి కనీసం రూ.13వేల 490 పెట్టుబడిగా పెట్టాల్సి ఉందని తేలింది. 

ప్రస్తుతం కంపెనీ షేర్ల కోసం ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ కనిపించటంతో షేర్లకు గ్రేమార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో షేరుపై గ్రేమార్కెట్ ప్రీమియం రూ.25గా కొనసాగుతోంది. లిస్టింగ్ రోజు వరకు ఇదే కొనసాగితే స్టాక్ ధర ఒక్కోటి రూ.130 చొప్పున జాబితా అయ్యే అవకాశం ఉంది.

కంపెనీ వ్యాపారం..
 ముంబై కేంద్రంగా పనిచేస్తున్నఈ కంపెనీ పవర్ సొల్యూషన్స్ ఉత్పత్తులను డిజైన్, తయారీ వ్యాపారంలో ఉంది. కంపెనీ యూపీఎస్ సిస్టమ్స్, ఇన్వర్టర్ సిస్టమ్స్, సోలార్ హైబ్రిడ్ ఇన్వర్టర్ సిస్టమ్స్, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్, వోల్టేజ్ స్టెబిలైజర్లు వంటి ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తోంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.