షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్​ఫెస్టివల్ లో ‘ఇన్విన్సిబుల్ హీరో’

షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్​ఫెస్టివల్ లో ‘ఇన్విన్సిబుల్ హీరో’

తెలంగాణలో పుట్టి బాలీవుడ్ హీరోగా రాణించారు పైడి జయరాజ్. తెలుగు వ్యక్తిగా.. మొట్టమొదట  దాదాసాహెబ్ పాల్కే అవార్డును జయరాజ్ అందుకున్నారు. వీరిపై ‘ఇన్విన్సి బుల్ హీరో’ అనే డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ సినిమా కలకత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్​ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడి విభాగంలో అవార్డు గెలుచుకుంది. దీంతో పాటు చైనాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్​ఫెస్టివల్ కు ఎంపికైంది.ఇప్పటికే మూడు ఇంటర్నేషనల్ ఫిల్మ్​ఫెస్టివల్స్​లో ప్రదర్శించిన, నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్​ఫెస్టివల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుంది.

బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత పైడి జై రాజ్ పై పొన్నం రవిచంద్ర, కత్తి చేతన్ దర్శకత్వం లో సుపదా క్రియేషన్స్​పతాకంపై నిర్మించిన ఈ డాక్యు మెంటరీ పలు ఇంటర్నే షనల్ ఫిల్మ్​ ఫెస్టివల్స్​కు ఎంపిక కావడం విశేషం. మార్చి 6 నుంచి 12వ తేదీ వరకు చైనాలోని షాంఘై పట్టణంలో నిర్వహించనున్న ఫిల్మ్​ ఫెస్టివల్లో పాల్గొనడానికి ఈ డాక్యుమెంటరీ నిర్మాత పొన్నం రవిచంద్ర ఈ నెల 4న చైనా బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణకు చెందిన పైడి జై రాజ్ పై రూపొందించిన డాక్యుమెంటరీ ఇంటర్నే షనల్ ఫెస్టివల్ కు ఎంపిక కావడంపై లోక్ సత్తా అధ్యక్షుడు శ్రీనివాస్, క్రిటిక్ వారాల ఆనంద్, సాహితీవేత్త లక్ష్మణ్‍ రావు, సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.