స్వయం ఉపాధిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

స్వయం ఉపాధిలో  శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

రంగారెడ్డి, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యువజన క్రీడల శాఖ శంషాబాద్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో  స్వయం ఉపాధి కోర్సుల్లో తక్కువ ఫీజుతో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి  నిరుద్యోగ యువతీ యువకుల నుంచి బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్/టైలరింగ్, ఎంఎస్ ఆఫీస్, సీసీ టీవీ టెక్నీషియన్ కోర్సుల్లో 3 నెలల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.  

ఆగస్టు 1 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని సెంటర్ ఇన్ చార్జిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హరీశ్ కోరారు. కోర్స్ పూర్తి చేసినవారికి ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు.