ఐఓసీఎల్‌‌‌‌‌‌‌‌లో 1746 అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఐఓసీఎల్‌‌‌‌‌‌‌‌లో 1746 అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌(ఐఓసీఎల్‌‌‌‌‌‌‌‌) 1746 గ్రాడ్యుయేట్​ అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: టెక్నీషియన్ అప్రెంటిస్- ఎలక్ట్రికల్,- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ట్రేడ్ అప్రెంటిస్ - ఫిట్టర్,- ఎలక్ట్రీషియన్, -ఎలక్ట్రానిక్స్ మెకానిక్,- మెషినిస్ట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ - డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఫ్రెషర్స్), ట్రేడ్ అప్రెంటిస్ - డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

అర్హత: ట్రేడ్‌‌‌‌‌‌‌‌ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌‌‌‌‌‌‌‌లో మెట్రిక్యులేషన్‌‌‌‌‌‌‌‌, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో మెరిట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. తెలంగాణలో 53 ఖాళీలు ఉన్నాయి. 
దరఖాస్తులు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ద్వారా జనవరి 3 వరకు అప్లై చేసుకోవాలి. వివరాల కోసం www.iocl.com వెబ్​సైట్​లో సంప్రదించాలి.