ఎన్‌టీపీసీతో జాయింట్ వెంచర్‌‌లో ఐఓసీ రూ.16వందల60 కోట్ల పెట్టుబడి

ఎన్‌టీపీసీతో జాయింట్ వెంచర్‌‌లో ఐఓసీ రూ.16వందల60 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ఇండియన్‌ఆయిల్‌ ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఐఓసీ  రూ.1,660.15 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్లను ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఈ జాయింట్ వెంచర్‌‌ను ఈ ఏడాది జూన్‌లో 50: 50 భాగస్వామ్యం కింద ఇరు కంపెనీలు ఏర్పాటు చేశాయి.

 తన వంతుగా రూ.1,660 కోట్లను ఐఓసీ  ఇన్వెస్ట్‌ చేసింది. ‘ఇండియన్ ఆయిల్​, ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ  సోలార్ పీవీ, విండ్‌, ఇతర రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టులను డెవలప్ చేస్తుంది. ఇండియన్ ఆయిల్ రిఫైనరీలకు  24 గంటల పాటు ఎటువంటి కరెంట్ కోత ఉండకుండా చూసేందుకు ఈ పవర్ ప్రాజెక్టులు పనిచేస్తాయి’ అని ఐఓసీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.