ఐఓసీ లాభం 37 శాతం అప్...క్యూ1 లో రూ. 13,750 కోట్లు

 ఐఓసీ లాభం 37 శాతం అప్...క్యూ1 లో రూ. 13,750 కోట్లు

న్యూఢిల్లీ : ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్ జూన్​ క్వార్టర్లో ​ రూ. 13,750 కోట్ల నికర లాభంతో మార్కెట్​ అంచనాలను మించింది. అంతకు ముందు క్వార్టర్​తో పోలిస్తే నికర లాభం 37 శాతం ఎగసింది. మరోవైపు రెవెన్యూ మాత్రం 2.36 శాతం తగ్గి రూ. 2.21 లక్షల కోట్లకు పరిమితమైంది. కంపెనీ ఆపరేషనల్​ పెర్ఫార్మెన్స్​ తాజా క్వార్టర్లో మెరుగుపడింది. ఈ క్వార్టర్లో ఇబిటా 44.5 శాతం పెరిగి రూ. 22,163 కోట్లకు చేరడమే దీనికి నిదర్శనం. ఏప్రిల్ – జూన్​ మధ్య కాలంలో యావరేజ్​ గ్రాస్​ రిఫైనింగ్​ మార్జిన్​ (జీఆర్ఎం) బ్యారెల్‌‌కు 8.34 డాలర్లుగా ఉందని ఐఓసీ వెల్లడించింది. 

అంతకు ముందు ఏడాది అంటే జూన్​ 2022 క్వార్టర్లో కంపెనీకి రూ. 1,992 కోట్ల నష్టం వచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్వార్టర్లో ఐఓసీ రెవెన్యూ రూ. 2.51 లక్షల కోట్లు. జూన్​ 2023 క్వార్టర్‌‌‌‌లో  పెట్రోలియం ప్రొడక్ట్స్​ ఇబిటా రూ. 18,720 కోట్లకు పెరగ్గా, పెట్​కెమ్​ ఇబిటా మాత్రం రూ. 88 కోట్లకు పడిపోయిందని ఐఓసీ తెలిపింది. రిజల్ట్స్​ ప్రకటన నేపథ్యంలో ఐఓసీ షేరు శుక్రవారం సెషన్లో 3.5 శాతం నష్టపోయింది.