న్యూఢిల్లీ: వరల్డ్ వైడ్ పాపులర్ అవుతున్న పికిల్‌బాల్ ఆట ఇప్పుడు ప్రొఫెషనల్ లీగ్ రూపంలో దేశంలోకి అడుగుపెడుతోంది. తొలి ఎడిషన్ ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ (ఐపీబీఎల్) డిసెంబర్ 1 నుంచి 7 వరకు ఢిల్లీలో జరగనుంది. ఇండియన్ పికిల్‌బాల్ అసోసియేషన్ (ఐపీఏ) అధికారిక గుర్తింపు పొందిన ఈ లీగ్‌లో దేశ, విదేశాలకు చెందిన స్టార్స్, యంగ్ ప్లేయర్లు రౌండ్ రాబిన్ నాకౌట్ ఫార్మాట్‌లో పోటీ పడతారని ఆర్గనైజర్స్ గురువారం ప్రకటించారు. ఐపీబీఎల్ రాక దేశంలో పికిల్ బాల్‌కు చారిత్రక ఘట్టమని ఐపీఏ ప్రెసిడెంట్ సూర్యవీర్ సింగ్ భుల్లార్ అన్నారు.
