పంజాబ్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ ఘన విజయం

పంజాబ్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ ఘన విజయం

ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ ఫస్ట్ నుంచే దూకుడుగా ఆడింది. బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ (56)తో అదరగొట్టగా చివర్లో వికెట్ కీపర్ జితేశ్ శర్మ చిచ్చరపిడుగల్లే చెలరేగడంతో స్కోరు పరుగులు తీసింది. 18 బాల్స్ లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 రన్స్ (నాటౌట్) చేసిన జితేశ్ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. భానుక రాజపక్స 27, లియామ్ లివింగ్ స్టోన్ 22 పరుగులు చేయగా, శిఖర్ ధవన్ 12, మయాంక్ అగర్వాల్ 15 పరుగులు చేశారు. రిషి ధావన్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌కు మూడు వికెట్లు లభించాయి.