వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా గుజరాత్

వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా గుజరాత్

కీలక మ్యాచులో గుజరాత్ వెటరన్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచ‌రీతో అలరించాడు. మొదట్లో ఆచితూచి ఆడిన సాహా, గిల్ వెనుదిరిగాక జోరు పెంచాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. సాహా వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి యువ బ్యాటర్ సాయి సుద‌ర్శ‌న్‌(30) మంచి సహకారం అందిస్తున్నాడు. 13 ఓవ‌ర్లు ముగిసేసరికి గుజరాత్  వికెట్ నష్టానికి124 పరుగులు చేసింది. 

మరో గుజ‌రాత్ ఓపెన‌ర్‌, గత మ్యాచ్ సెంచరీ హీరో శుభ్‌మ‌న్ గిల్(39) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఏడో ఓవర్​లో జడేజా ఆఖరి బంతిని కవ్వించేలా వేయడంతో గిల్.. ధోని బుట్టలో పడిపోయాడు. బంతి.. బ్యాట్‌ను తాకుతున్నట్టే వెళ్లి వికెట్ల వెనకాల ఉన్న ధోనీ చేతుల్లో పడింది. అంతే ధోనీ క్షణాల్లోవికెట్లను గిరాటేసి గిల్‌ని పెవిలియన్ బాట పట్టించాడు.