వరుణుడు మళ్లీ వచ్చేశాడు.. ఆగిన మ్యాచ్

వరుణుడు మళ్లీ వచ్చేశాడు.. ఆగిన మ్యాచ్

ఫైనల్ పోరుకు మరోసారి ఆటంకం కలుగుతోంది. వరుణుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. దీంతో సిబ్బంది ప‌రుగున వ‌చ్చి పిచ్‌ను క‌వ‌ర్ల‌తో క‌ప్పేశారు. వర్షంతో పాటు భారీ వీదురు గాలులు వీస్తున్నాయి. ఈ గాలులకు కవర్లు పక్కకు తప్పుతుండడంతో సిబ్బందికి కవర్లు కప్పి ఉంచటం కష్టతరమవుతోంది. ఓవర్ల తగ్గింపుకు దాదాపు రెండు గంటల సమయం ఉండటంతో.. వర్షం ఆగితే పూర్తి ఓవర్ల మ్యాచును చూడవచ్చు. 

కాగా, అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది. అన్‌క్యాపెడ్ ప్లేయర్ సాయి సుద‌ర్శ‌న్‌(96) విధ్వంసం సృష్టించగా, వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా(54) చక్కని సహకారం అందించాడు. వీరిద్దరికి తోడు గిల్ (39), హార్దిక్ పాండ్యా(21) కూడా రాణించడంతో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. చెన్నై బౌలర్లలో పతిరానా రెండు వికెట్లు తీయగా.. జడేజా, దీపక్‌ చాహర్‌లు చెరొక వికెట్‌ తీశారు.