IPL 2023 : జియో IPL విప్లవం.. 3 రోజుల్లో 147 కోట్ల వ్యూస్

IPL 2023 : జియో IPL విప్లవం.. 3 రోజుల్లో 147 కోట్ల వ్యూస్

ఐపీఎల్ (IPL2023) డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. జియోలో ఫ్రీగా ప్రసారం అవుతున్న ఐపీఎల్ మ్యాచులను ఇరగబడి చూస్తున్నారు క్రికెట్ అభిమానులు. జస్ట్ మూడు రోజుల్లోనే.. ఐదు మ్యాచులకు 147 కోట్ల వ్యూస్ రావటం డిజిటల్ చరిత్రలో ఇదే.. అంతే కాదు.. ప్రతి కస్టమర్ కనీసం 57 నిమిషాలు యావరేజ్ వ్యూ ఉండటం విశేషం. ఇది ఒక రికార్డ్ అయితే.. మరో రికార్డ్ ఉంది. ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి వారం రోజుల్లోనే  ఐదు కోట్ల మంది జియో యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఫస్ట్ మ్యాచ్ రోజే 2 కోట్ల 50 లక్షల డౌన్ లోడ్స్ లో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది జియో. 

జియో ఐపీఎల్ డిజిటల్ విప్లవంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. జియో యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచులను చూసే కొత్త వారి సంఖ్య 10 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తున్న 60 శాతం మంది జియో యాప్ ద్వారానే చూస్తున్నట్లు అంచనా. దీనికి కారణం 12 భాషల్లో లైవ్ ప్రసారాలు అందించటమే కాకుండా.. మల్టీ క్యామ్ సెటప్, 4కే ఫీడ్ తో అందుబాటులో ఉంటుంది. దీనికితోడు జియో యాప్ లో ఐపీఎల్ మ్యాచ్ లు అన్నీ ఉచితంగా ప్రసారం అవుతున్నాయి.

ఇదంతా జియోకు బాగా కలిసి వచ్చింది. నెటిజన్లు అందరూ యాప్ వైపు డైవర్ట్ అయ్యారు. టీవీల్లో హాట్ స్టార్ ద్వారా ప్రసారం అవుతున్నా  దానికి డబ్బులు చెల్లించాల్సి రావటంతో.. జియో వైపు మొగ్గు చూపుతున్నారు. స్మార్ట్ టీవీల్లో జియో సినిమా ఫ్రీ కావటంతో.. అందులోనే చూస్తున్నారు క్రికెట్ అభిమానులు.

జియో సినిమా ఐపీఎల్ 2023 మ్యాచ్ లను అన్ని భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండటం.. అది కూడా ఫ్రీ కావటంతో డౌన్ లోడ్స్ బీభత్సంగా పెరిగాయి. ఈ క్రమంలోనే 20 ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు.. తమ యాడ్స్ ను జియోలో ఇచ్చేందుకు ఒప్పందం చేసుకోవటం విశేషం. రిలయన్స్ ఏ మాత్రం తక్కువ తినలేదు.. ఐపీఎల్ డిజిటల్ రైట్స్ ను 23 వేల 800 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

ఈ మాత్రం వ్యూవర్ షిప్ ఉంటే కానీ.. యాడ్స్ రావు కదా.. అనుకున్నట్లుగానే మూడు మ్యాచ్ ల ద్వారా 147 కోట్ల వ్యూస్ రాబట్టుకోవటంతోపాటు.. యావరజ్ వ్యూవర్ షిప్ 57 నిమిషాలుగా ఉండటంతో.. కంపెనీలు యాడ్స్ ఇచ్చేందుకు ఎగబడుతున్నాయి.. మొత్తానికి రిలయన్స్ ఫ్రీ మంత్రం బాగా పని చేసింది అంటున్నాయి మార్కెట్ వర్గాలు..