GT vs PBKS: వద్దనుకున్నవాడే మ్యాచ్ గెలిపించాడు.. ఎవరీ శ‌శాంక్ సింగ్..?

GT vs PBKS: వద్దనుకున్నవాడే మ్యాచ్ గెలిపించాడు.. ఎవరీ శ‌శాంక్ సింగ్..?

200 పరుగుల భారీ లక్ష్యం.. స్టార్ ఆటగాళ్లంతా పెవిలియన్ కు చేరారు.. 70 పరుగులకే నాలుగు వికెట్లు.. ఆశలు పెట్టుకున్న సికిందర్ రాజా కాసేపటికే ఔట్.. గ్రీజ్ లో అనుభవం లేని ఒక దేశవాళీ క్రికెటర్..ఇదీ నిన్న (ఏప్రిల్ 5) గుజరాత్ టైటాన్స్ తో భారీ ఛేజింగ్ లో పంజాబ్ పరిస్థితి. ఈ దశలో పంజాబ్ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. అలాంటి అద్భుతాన్ని చేసి చూపించాడు పంజాబ్ బ్యాటర్ శ‌శాంక్ సింగ్. ఒక్క అంతర్జాతీయ అనుభవం లేకపోయినా ఒత్తిడిలో ఇతను ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. 

ఆరో స్థానంలో వచ్చిన శశాంక్ తన బ్యాటింగ్ తో పంజాబ్ కు ఊహించని విజయాన్ని అందించాడు. ఓడిపోతున్న మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. చివరి వరకు క్రీజ్ లో ఉండి తన విలువెంతో తెలియజేశాడు. ఐపీఎల్ ఆక్షన్‌లో పొరపాటున పంజాబ్ జట్టులోకి వచ్చాడు శశాంక్. త‌న‌ను తీసుకోవ‌డం పొర‌పాటు కాద‌ని నిరూపించాడు. శ‌శాంక్ సింగ్. రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు అతడు పంజాబ్‌ జట్టులోకి వచ్చి ఇప్పుడు ఆ జట్టుకే ఆపద్బాంధవుడయ్యాడు. కేవలం 29 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో 61 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఆడాడు.

Also Read :ఢిల్లీతో మ్యాచ్‌కు సిద్ధం.. ముంబై చేరుకున్న సూర్యకుమార్ యాదవ్

శశాంక్ సింగ్ సింగ్ ఛత్తీస్ ఘర్ లో జన్మించాడు. అతని వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చాటి 2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్ కంటే ముందు శశాంక్ ఢిల్లీ, హైదరాబాద్, రాజస్థాన్ స్క్వాడ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు శశాంక్ 58 దేశవాళీ టీ20లు ఆడాడు. 137.34 స్ట్రైక్ రేట్‌తో 754 పరుగులు చేశాడు. బ్యాటింగ్ తో పాటు మీడియం పేసర్ తో రాణించగలరు.