
జైపూర్: ఐపీఎల్‌లో 11 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్లేఆఫ్స్ చేరుకున్న పంజాబ్ కింగ్స్ తమ ఆఖరి లీగ్ పోరులో అదరగొట్టింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు చెక్ పెడుతూ టాప్–2 ప్లేస్ ఖాయం చేసుకొని నేరుగా క్వాలిఫయర్–1 మ్యాచ్‌కు అర్హత సాధించింది. జోష్ ఇంగ్లిస్ (42 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 73), ప్రియాన్ష్ ఆర్య (35 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 62) ఫిఫ్టీలతో విజృంభించడంతో సోమవారం జరిగినమ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (39 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57) ఫిఫ్టీతో సత్తా చాటాడు.
అర్ష్‌దీప్ సింగ్, యాన్సెన్, విజయ్‌కుమార్ వైశాక్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం పంజాబ్ 18.3 ఓవర్లలోనే 187/3 స్కోరు చేసి గెలిచింది. ఇంగ్లిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 14 మ్యాచ్‌ల్లో 19 పాయింట్లతో పంజాబ్ టాప్ ప్లేస్‌కు చేరుకుంది. మంగళవారం లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడితే పంజాబ్‌దే టాప్ ప్లేస్ అవుతుంది. ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే ఇరు జట్లూ 19 పాయింట్లకు చేరుకుంటాయి. అప్పుడు రన్‌రేట్ ఎక్కువగా ఉన్న జట్టు అగ్రస్థానం సొంతం చేసుకుంటుంది. ముంబై 16 పాయింట్లతో నాలుగో ప్లేస్ సాధించింది.
ఫిఫ్టీతో ఆదుకున్న సూర్య
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై సూర్యకుమార్ పోరాటంతో మంచి స్కోరు చేసింది. ఆరంభంలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (20 బాల్స్‌లో 27) నాణ్యమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. జెమీసన్ వేసిన రెండో ఓవర్లో ర్యాన్ రెండు ఫోర్లతో జోరందుకున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (21 బాల్స్‌లో 24) నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా యాన్సెన్ బౌలింగ్‌లో మిడాఫ్ మీదుగా స్ట్రెయిట్ సిక్స్‌తో గాడిలో పడ్డాడు.
పంజాబ్ కింగ్స్ తరఫున ఈ సీజన్‌లో తన చివరి మ్యాచ్ ఆడుతున్న యాన్సెన్ ఆరో ఓవర్లో రికెల్టన్‌ను పెవిలియన్ చేర్చడంతో పవర్ ప్లేను ముంబై 52/1తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత పంజాబ్ రన్స్ నియంత్రించే ప్రయత్నం చేసింది. జెమీసన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ 6, 4, 4తో జోరు చూపెట్టినా.. స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ మిడిల్ ఓవర్లలో మరోసారి ఆకట్టుకున్నాడు. అతని బౌలింగ్‌లో రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో వాధెరా అద్భుతంగా అందుకున్నాడు.
సూర్యకుమార్ క్రీజులో కుదురుకున్నా.. తిలక్ వర్మ (1) నిరాశ పరిచాడు. అతనితో పాటు విల్ జాక్స్ (17)ను విజయ్ కుమార్ పెవిలియన్ చేర్చడంతో ముంబై 13వ ఓవకు 106/4తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (26) తన తొలి బాల్‌కే ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను విజయ్‌కుమార్ డ్రాప్ చేయడంతో లైఫ్ లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న పాండ్యా.. బ్రార్ బౌలింగ్‌లో సిక్స్‌తో గేరు మార్చాడు.
మరో రెండు ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను యాన్సెన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 18వ ఓవర్లో జెమీసన్ ఐదు రన్సే ఇచ్చినా.. విజయ్ కుమార్ బౌలింగ్‌లో నమన్ ధీర్ (20) రెండు సిక్సర్లు, సూర్యకుమార్ రెండు ఫోర్లు సహా 23 రన్స్ రాబట్టారు. దాంతో ముంబై 200 మార్కు దాటేలా కనిపించింది. కానీ, చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి మూడు రన్సే ఇచ్చి కట్టడి చేశాడు.
ఆర్య, జోష్ జోర్‌దార్
ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ ఫిఫ్టీలతో విజృంభించడంతో ముంబై ఇచ్చిన టార్గెట్‌ను పంజాబ్ ఈజీగా అందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్ (13) తొలి వికెట్‌కు 34 రన్స్ జోడించి మంచి పునాది వేశారు. తొలి ఓవర్లో బౌల్ట్‌కు ఆర్య రెండు ఫోర్లతో స్వాగతం పలకగా.. దీపక్ చహర్ మెయిడిన్ ఓవర్‌తో బౌలింగ్ ప్రారంభించాడు. అతని తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 6, 4 కొట్టాడు. కానీ, ఐదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా రెండో బాల్‌కే ప్రభ్‌ను ఔట్ చేసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. కానీ, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వన్‌డౌన్ బ్యాటర్ ఇంగ్లిస్వచ్చీరాగానే సిక్స్ బాదగా పవర్ ప్లేను పంజాబ్ 47/1తో ముగించింది. మిడిల్ ఓవర్లో ఆర్య, జోష్ మరింత జోరు పెంచారు. స్పిన్నర్ శాంట్నర్‌తో పాటు బుమ్రా, హార్దిక్, అశ్వనీ కుమార్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
నాణ్యమైన షాట్లతో క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టారు. అశ్వనీ వేసిన 11వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు రాబట్టిన ఇంగ్లిస్ స్కోరు వంద దాటించాడు. అతను 29 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. పాండ్యా బౌలింగ్‌లో 4, 6తో ఆర్య 27 బాల్స్‌లోనే ఈ మార్కు దాటాడు. చివరకు శాంట్నర్ వేసిన స్లో టర్నింగ్ బాల్‌కు ఆర్య ఔటవడంతో రెండో వికెట్‌కు 109 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. కానీ, అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. విజయం ముంగిట ఇంగ్లిస్ ఔటైనా..బౌల్ట్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (26 నాటౌట్) మ్యాచ్ ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 184/7 (సూర్యకుమార్ 57, రికెల్టన్ 27, అర్ష్‌దీప్ 2/28)
పంజాబ్: 18.3 ఓవర్లలో 187/3 (ఇంగ్లిస్ 73, ఆర్య62, శాంట్నర్ 2/41).