
ముంబై: ఐపీఎల్ 2024 ఆటగాళ్ల వేలం దుబాయ్‌లో జరగనుంది. డిసెంబర్ 19 వ తేదీన వేలం నిర్వహిస్తామని ఐపీఎల్ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. దాంతో ఐపీఎల్ వేలం తొలిసారి ఇండియా బయట జరగనుంది. అలాగే వచ్చే సీజన్ ప్లేయర్ రిటెన్షన్ గడువును పొడిగించినట్టు తెలిపారు. టీమ్స్ తాము రిటైన్ చేసుకున్న ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించేందుకు ఈ నెల 15వ తేదీ వరకు ఉన్న డెడ్‌లైన్ ను 26 వరకు పొడిగించినట్టు తెలిపారు. కాగా, లక్నో సూపర్ జెయింట్స్ విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ (రూ. 50 లక్షలు) ను ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్ చేసింది.