ఆల్వాల్ లో బెట్టింగ్ లీడర్ అరెస్ట్.. రూ.32 లక్షలు పట్టివేత

ఆల్వాల్ లో బెట్టింగ్ లీడర్ అరెస్ట్.. రూ.32 లక్షలు పట్టివేత

క్రికెట్ అభిమానులు ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు అదే అదునుగా తీసుకొని క్యాష్ చేసుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై ప్రజలకు ఉన్న క్రేజీని బెట్టింగ్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. అల్వాల్ లో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అల్వాల్ హిల్స్ లో నివాసం ఉంటున్న బాల శౌరిరెడ్డి అనే బెట్టింగ్ నిర్వహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఐపీఎల్ బెట్టింగ్ పెద్ద ఎత్తున నడిపిస్తున్నట్లు.. పోలీసులకు సమాచారం రావడంతో బాల శౌరిరెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

బాల శౌరిరెడ్డి ఇంట్లో నుంచి రూ. 15 లక్షలు, బ్యాంకు ఖాతాలో ఉన్న మరో రూ. 15 లక్షల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని నుంచి మొత్తం రూ. 32 లక్షల సోమ్మును పోలీసులు స్వాధీనం చేసుకొని.. అల్వాల్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టారు.