
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ తమ ఇంటికి రావడం లైఫ్‌లో మరిచిపోలేని సర్‌ప్రైజ్ అని టీమిండియా, ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ చెప్పాడు. అలాగే ఐపీఎల్ తన లైఫ్ నే మార్చేసిందన్నాడు. ‘హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ టైమ్‌లో డిన్నర్‌కు రావాలని ఆర్సీబీ ప్లేయర్లను మా ఇంటికి ఆహ్వానించా. నేను హోటల్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లా. విరాట్‌ను కూడా పిలిచా. కానీ బ్యాక్‌పెయిన్ కారణంగా రాలేనని చెప్పాడు. అయితే, అందరూ ఇంటికి వచ్చినప్పుడు కారు నుంచి కోహ్లీ కూడా దిగడం కనిపించింది. నేను పరుగెత్తుకుంటూ వెళ్లి కోహ్లీని గట్టిగా హగ్ చేసుకున్నా. ఎందుకంటే కోహ్లీ మా టోలీచౌకీకి రావడం బిగ్ న్యూస్ కదా. ఇక ఐపీఎల్ నా లైఫ్ నే మార్చేసింది. మా నాన్న ఆటో నడిపేవారు. నాకు ఓ ప్లాటినా బైక్ ఉండేది. ఉప్పల్ స్టేడియం వెళ్లేందుకు పెట్రోల్ కోసం నాన్న రూ.60 ఇచ్చేవారు. కానీ ఐపీఎల్ చాన్స్ రాగానే ఆ కష్టాలన్నీ తీరిపోయాయి’ అని గుర్తు చేసుకున్నాడు.