కోట్లు కురిసే వేళ..ఇయ్యాల (డిసెంబర్ 19 న) దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేలం

కోట్లు కురిసే వేళ..ఇయ్యాల (డిసెంబర్ 19 న) దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేలం
  • 77 ఖాళీలకు 333 మంది పోటీ
  • మ. 1 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  జియో సినిమాలో లైవ్

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : క్రికెటర్లపై కాసుల వర్షం కురిసే సమయం వచ్చింది. దమ్మున్న ఆటగాళ్లు ఒక్క రోజుతోనే కోటీశ్వరులు అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2024 సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం క్రికెటర్ల వేలం మంగళవారం జరగనుంది. తొలిసారి ఇండియా అవతల.. దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కోకాకోలా ఎరీనాలో జరిగే ఈ మినీ ఆక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మొత్తం 333 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పది జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం పోటీ పడనున్నారు. బరిలో నిలిచిన ప్లేయర్లలో 214 మంది ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు అసోసియేట్ దేశాల క్రికెటర్లు సహా 119 మంది ఫారినర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

ఖాళీగా ఉన్న వాటిలో 47  స్థానాలు ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి కాగా, 30 మంది ఫారిన్ ప్లేయర్లను భర్తీ చేయాల్సి ఉంది. డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువ, క్వాలిటీ ఆటగాళ్లు తక్కువగా ఉండటంతో పలువురి పంట పండే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది మెగా వేలం జరగనుండగా ప్రతీ ఫ్రాంచైజీ తమ కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నాయి.

ఈ  నేపథ్యంలో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తమకు పనికొచ్చే వారి కోసం పోటాపోటీగా వేలంలో పాల్గొనబోతున్నాయి.  ఇటీవల విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను నిర్వహించిన మల్లికా సాగర్ ఈసారి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆక్షనీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండనుంది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేలం నిర్వహిస్తున్న తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కనుంది.

స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శార్దూల్, రచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వేలంలో ఆటగాళ్లను వారి స్పెషలైజేషన్ ఆధారంగా 19 వేర్వేరు సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విభజించారు. మొత్తం 23 మంది ఆటగాళ్లు అత్యధిక బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. రెండు కోట్ల కేటగిరీలో ఉన్నారు.  మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, ఉమేష్ యాదవ్ ,శార్దూల్ ఠాకూర్ ఈ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. మరో13 మంది ఆటగాళ్ళు తమ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.1.5 కోట్లుగానమోదు చేసుకున్నారు. ఎనిమిదేండ్ల గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆసీస్ స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ మిచెల్ స్టార్క్‌‌పై  అన్ని ఫ్రాంచైజీల ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. దాంతో తను భారీ మొత్తం పలికే అవకాశం కనిపిస్తోంది.

వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దుమ్మురేపిన కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర రూ. 50 లక్షలు బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వస్తున్నప్పటికీ అతని కోసం జట్లు పోటీ పడే చాన్సుంది. స్టార్క్, రచిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఆసీస్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫైనల్ హీరో హెడ్,  సౌతాఫ్రికా పేస్ సెన్సేషన్ కోయెట్జీ, లంక స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వానిందు హసరంగ, ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శార్దూల్, హర్షల్ పటేల్, షారూఖ్ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కోసం బిడ్డింగ్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడవొచ్చు. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లలో అర్షిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కులకర్ణి, కుమార్ కుశాగ్ర, ముషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది.

నగదులో గుజరాత్..  ఖాళీల్లో కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్

ప్లేయర్ల రిటెన్షన్, వేలం కోసం ప్రతీ ఫ్రాంచైజీకి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 100 కోట్లను కేటాయించింది. రిటెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత గత సీజన్ రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుజరాత్ టైటాన్స్ వద్ద అత్యధికంగా రూ. 38.15 కోట్లు మిగిలాయి. ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు ఫారినర్స్ సహా ఎనిమిది స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ వద్ద అందరికంటే తక్కువగా రూ.13.15 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో ఆరుగురు ప్లేయర్లు అవసరం. కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌లో అత్యధికంగా 12 స్లాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాళీగా ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీ వద్ద రూ. 32.7 కోట్లు మిగిలున్నాయి. మొత్తంగా పది  ఫ్రాంచైజీల వద్ద  కలిపి మొత్తంగా రూ. 262.95 కోట్లు అందుబాటులో ఉన్నాయి.