ఆరుగురు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లకు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీలు వల

ఆరుగురు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లకు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీలు వల

లండన్‌‌‌‌‌‌‌‌: ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ వదిలేసి తమ తరఫున టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌లు ఆడితే కాసుల వర్షం కురిపిస్తామని ఆరుగురు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లకు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీలు వల వేసినట్లు తెలుస్తోంది. ఏడాది పొడవునా షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉంటే వార్షిక కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద దాదాపు 5 మిలియన్‌‌‌‌‌‌‌‌ పౌండ్ల వరకు ఇస్తామని బంపరాఫర్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించాయి. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్నా.. ఆ క్రికెటర్లు ఎవరనేది మాత్రం బహిర్గతం కాలేదు.

ప్రస్తుతం ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పది ఫ్రాంచైజీలకు వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌, సౌతాఫ్రికా, గ్లోబల్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ (యూఏఈ), మేజర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) టీ20 టోర్నీల్లో టీమ్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. దీంతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను తమ తరఫున ఆడించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకునేందుకు ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు కొంత మంది ప్లేయర్లతో  కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌లు కుదుర్చుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు  క్రికెట్‌‌‌‌‌‌‌‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఆసీస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లతోనూ ఇలాంటి చర్చలే జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై దృష్టిసారించిన ఐసీసీ  లీగ్స్‌‌‌‌‌‌‌‌పై పరిమితి విధించాలని భావిస్తున్నా.. అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఒకవేళ పరిమితి లేకపోతే చాలా మంది యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషన్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పి టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌ల వైపు వెళ్లినా ఆశ్చర్యం లేదు.