ఆర్​సీబీ ఢమాల్​​: 92కే కుప్పకూలిన కోహ్లీసేన

ఆర్​సీబీ ఢమాల్​​: 92కే కుప్పకూలిన కోహ్లీసేన
  • వరుణ్‌‌, రస్సెల్‌‌కు 
  • చెరో మూడు వికెట్లు
  • కోల్‌‌కతా ఘన విజయం

ఫస్ట్‌‌‌‌ ఫేజ్‌‌‌‌లో వరుస విజయాలతో దుమ్మురేపిన బెంగళూరుకు.. అరబ్‌‌‌‌ గడ్డపై ఆరంభం కలిసిరాలేదు..! ఫేవరెట్‌‌‌‌గా దిగిన మ్యాచ్‌‌‌‌లో తమకంటే తక్కువ స్థాయి ప్రత్యర్థి చేతిలో బొక్కబోర్లా పడింది..! వరల్డ్‌‌‌‌ క్లాస్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ అందుబాటులో ఉన్నా.. ఓపికగా ఆడలేక బ్యాటింగ్‌‌‌‌లో ఘోరంగా చతికిలపడింది..! ఫలితంగా ఐపీఎల్‌‌‌‌లో తన 200 మ్యాచ్‌‌‌‌ కోహ్లీకి చేదు జ్ఞాపకంగా మిగిలింది..! మరోవైపు ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొట్టిన కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ 9 వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవంగా ఉంచుకుంది..!

అబుదాబి: ఐపీఎల్‌‌‌‌–14 సెకండ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌లో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ బోణీ కొట్టింది. బౌలింగ్‌‌‌‌లో వరుణ్‌‌‌‌ చక్రవర్తి (3/13), ఆండ్రీ రసెల్ (3/9) సూపర్​ స్పెల్‌‌‌‌తో పాటు బ్యాటింగ్‌‌‌‌లో శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (34 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 48) దుమ్మురేపడంతో.. సోమవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ 9 వికెట్ల తేడాతో బెంగళూరుకు షాకిచ్చింది. టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన బెంగళూరు 19 ఓవర్లలో 92 రన్స్‌‌‌‌కు కుప్పకూలింది. దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌ (22) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తర్వాత కోల్‌‌‌‌కతా 10 ఓవర్లలో వికెట్‌‌‌‌ నష్టానికి 94 రన్స్‌‌‌‌ చేసి నెగ్గింది. చిన్న టార్గెట్‌‌‌‌ను ఓపెనర్లు గిల్‌‌‌‌, వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 41 నాటౌట్‌‌‌‌) నింపాదిగా ఛేదించారు. బెంగళూరు బౌలర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో.. ఈ ఇద్దరు పోటీపడి బౌండ్రీలు బాదారు. ఫలితంగా పవర్‌‌‌‌ప్లేలో ఎనిమిది ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌ రావడంతో  కోల్‌‌‌‌కతా 56/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఫీల్డింగ్‌‌‌‌ విస్తరించిన తర్వాత హసరంగ బౌలింగ్‌‌‌‌లో గిల్‌‌‌‌ కవర్స్‌‌‌‌లో సూపర్‌‌‌‌ సిక్స్‌‌‌‌ కొట్టాడు. ఆ వెంటనే మరో ఫోర్‌‌‌‌ బాదడంతో ఈ ఓవర్‌‌‌‌లో 13 రన్స్‌‌‌‌ వచ్చాయి. అయితే 48 రన్స్‌‌‌‌ వ్యక్తిగత స్కోరు వద్ద చహల్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో గిల్‌‌‌‌ లాంగాన్‌‌‌‌లో కొట్టిన భారీ షాట్‌‌‌‌ను సిరాజ్‌‌‌‌ అందుకోవడంతో ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 82 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. కానీ ఇదే ఓవర్‌‌‌‌లో వెంకటేశ్‌‌‌‌ మూడు ఫోర్లు బాదడంతో మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే చిరస్మరణీయ విజయం సొంతమైంది. వరుణ్​కు ‘మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 
బౌలింగ్‌‌‌‌ అదుర్స్‌‌‌‌
ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన బెంగళూరుకు.. నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ స్పిన్‌‌‌‌–పేస్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ ఊహించని షాకిచ్చింది. ఇన్నింగ్స్‌‌‌‌ సెకండ్ ఓవర్‌‌‌‌లోనే ప్రసిధ్​ కృష్ణ.. ఓపెనర్‌‌‌‌ కోహ్లీ (5)ని ఔట్‌‌‌‌ చేశాడు. ఇదే జోష్‌‌‌‌ను వరుణ్‌‌‌‌, రసెల్‌‌‌‌ చివరి వరకు కంటిన్యూ చేశారు. ఐపీఎల్‌‌‌‌లో డెబ్యూ చేసిన తెలుగు కుర్రాడు శ్రీకర్‌‌‌‌ భరత్ (16)తో కలిసి నెమ్మదిగా ఆడిన పడిక్కల్‌‌‌‌ వీలైనప్పుడల్లా బౌండ్రీలు కొట్టడంతో స్కోరు బోర్డు కాస్త మెరుగైంది. ఇక ఫర్వాలేదనుకుంటున్న తరుణంలో ఆరో ఓవర్‌‌‌‌లో ఫెర్గుసన్‌‌‌‌ (2/24).. పడిక్కల్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేశాడు. సెకండ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 31 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ కావడంతో పాటు పవర్‌‌‌‌ప్లేలో 41/2 స్కోరు మాత్రమే వచ్చింది. అప్పటికే కష్టాల్లో కొనసాగుతున్న బెంగళూరుకు 9వ ఓవర్‌‌‌‌లో రసెల్‌‌‌‌ డబుల్ షాకిచ్చాడు. ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు శ్రీకర్‌‌‌‌ను, నాలుగో బాల్‌‌‌‌కు ‘మిస్టర్‌‌‌‌ 360’ డివిలియర్స్‌‌‌‌ (0) గోల్డెన్‌‌‌‌ డక్‌‌‌‌గా పెవిలియన్‌‌‌‌కు పంపాడు. లాస్ట్‌‌‌‌ 4 ఓవర్లలో 13 రన్సే రావడంతో.. ఫస్ట్ టెన్‌‌‌‌లో ఆర్‌‌‌‌సీబీ 54/4తో నిలిచింది. స్టార్టింగ్‌‌‌‌లో ఒక్క ఓవర్‌‌‌‌ వేసిన వరుణ్‌‌‌‌ సెకండ్‌‌‌‌ స్పెల్‌‌‌‌లో మరింత రెచ్చిపోయాడు. 12వ ఓవర్‌‌‌‌లో వరుస బంతుల్లో మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (10), హసరంగ (0)ను, తన తర్వాతి ఓవర్‌‌‌‌లో సచిన్ బేబీ (7)ని ఔట్‌‌‌‌ చేయడంతో ఆర్‌‌‌‌సీబీ కోలుకోలేకపోయింది. లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో ఆశలు పెట్టుకున్న జెమీసన్‌‌‌‌ (4), హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ (12)తో పాటు సిరాజ్‌‌‌‌ (8) కూడా వరుస ఓవర్లలో వెనుదిరిగారు. దీంతో 15 ఓవర్లలో 75/7 స్కోరుతో ఉన్న బెంగళూరు పూర్తి ఓవర్లు కూడా ఆడకుండానే 92 రన్స్‌‌‌‌కు చాప చుట్టేసింది.


బెంగళూరు: కోహ్లీ (ఎల్బీ) ప్రసిధ్‌‌‌‌ కృష్ణ 5, పడిక్కల్‌‌‌‌ (సి) కార్తీక్‌‌‌‌ (బి) ఫెర్గుసన్‌‌‌‌ 22, శ్రీకర్‌‌‌‌ భరత్‌‌‌‌ (సి) గిల్‌‌‌‌ (బి) రసెల్‌‌‌‌ 16, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (బి) వరుణ్‌‌‌‌ 10, డివిలియర్స్‌‌‌‌ (బి) రసెల్‌‌‌‌ 0, సచిన్‌‌‌‌ బేబీ (సి) రాణా (బి) వరుణ్‌‌‌‌ 7, హసరంగ (ఎల్బీ) వరుణ్‌‌‌‌ 0, జెమీసన్‌‌‌‌ (రనౌట్‌‌‌‌) 4, హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ (బి) ఫెర్గుసన్‌‌‌‌ 12, సిరాజ్‌‌‌‌ (సి) వరుణ్‌‌‌‌ (బి) రసెల్‌‌‌‌ 8, చహల్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 2, ఎక్స్‌‌‌‌ట్రాలు: 6, మొత్తం: 19 ఓవర్లలో 92 ఆలౌట్‌‌‌‌. వికెట్లపతనం: 1–10, 2–41, 3–51, 4–52, 5–52, 6–63, 7–66, 8–76, 9–83, 10–92. బౌలింగ్‌‌‌‌: వరుణ్‌‌‌‌ చక్రవర్తి 4–0–13–3, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ 4–0–24–1, ఫెర్గుసన్‌‌‌‌ 4–0–24–2, నరైన్‌‌‌‌ 4–0–20–0, రసెల్‌‌‌‌ 3–0–9–3. 
కోల్‌‌‌‌కతా: గిల్‌‌‌‌ (సి) సిరాజ్‌‌‌‌ (బి) చహల్‌‌‌‌ 48, వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 41, రసెల్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 0, ఎక్స్‌‌‌‌ట్రాలు: 5, మొత్తం: 10 ఓవర్లలో 94/1. వికెట్లపతనం: 1–82, బౌలింగ్‌‌‌‌: సిరాజ్‌‌‌‌ 2–0–12–0, జెమీసన్‌‌‌‌ 2–0–26–0, హసరంగ 2–0–20–0, చహల్‌‌‌‌ 2–0–23–1, హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ 2–0–13–0.