
కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచులన్నింటిని తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మ్యాచులన్నింటిని సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్‌లో నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న భారత ఆటగాళ్లందరూ బయో బబుల్ నుంచి దుబాయ్‌కి వెళ్లనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 10న జరగనుంది. కాగా.. ఐపీఎల్ మ్యాచుల కారణంగా ఇంగ్లండ్ సిరీస్‌లో ఎటువంటి మార్పు ఉండదని బీసీసీఐ స్పష్టం చేసింది.