
న్యూఢిల్లీ: రెండు కొత్త ఫ్రాంచైజీలతో ఇప్పటికే రూ. 12 వేల 725 కోట్లు మూటగట్టుకున్న బీసీసీఐ మరో భారీ మొత్తానికి స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం అతి త్వరలోనే టెండర్స్‌ను పిలవనుంది. దీని ద్వారా రూ. 40 వేల కోట్ల వరకు రాబట్టాలని ప్లాన్ వేస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 30 రోజుల్లోనే ఇది ఫైనలైజ్ అయ్యే చాన్స్ ఉంది. 2017 నుంచి 2022కు గాను స్టార్ ఇండియా బీసీసీఐకి రూ. 16,347 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాదితో ఈ కాంట్రాక్ట్ ముగిసిపోతుంది. ఆ తర్వాత 2023 నుంచి 2027 గాను రైట్స్ విలువ రూ. 40 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.