ఐపీఎల్​ ఫేజ్​-2: రేస్​లో యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా

ఐపీఎల్​ ఫేజ్​-2: రేస్​లో యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా

రేస్​లో యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా
ముందుకొస్తున్న ఇంగ్లండ్​ కౌంటీలు 
సెప్టెంబర్​లో మిగతా లీగ్​కు ఓకే
బీసీసీఐ నిర్ణయం కోసం వెయిటింగ్​

న్యూఢిల్లీ: ఐపీఎల్​లో మిగిలిపోయిన మ్యాచ్​లను ఈ ఏడాది చివర్లో కంప్లీట్​ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నిర్ణయానికి లీగ్​ గవర్నింగ్​ కౌన్సిల్​, ఫ్రాంచైజీలు, బ్రాడ్​కాస్టర్స్​, ఇతర స్టేక్​ హోల్డర్స్​ కూడా పూర్తి మద్దతు పలుకుతున్నారు. ఇంతవరకు ఓకే ఉన్నా.. ఒకవేళ లీగ్​ను కొనసాగించాలంటే...  ఎప్పుడు? ఎక్కడ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు లభించకపోయినా.. కొన్ని ఈక్వేషన్స్​ అయితే బీసీసీఐ మదిలో ఉన్నాయి. వాటికి అనుగుణంగా బోర్డు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందోమో చూడాలి. 
ఇండియాలో కష్టమే..
ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. ఈ ఏడాది మొత్తంలో ఐపీఎల్​ పేజ్​–2 మ్యాచ్​లను ఇండియాలో నిర్వహించడం కష్టమే. విండో లభించినా, బయో బబుల్​ను మరింత పొటెన్షియల్​గా మార్చినా.. కరోనా కేసులు పెరుగుతున్న టైమ్​లో మళ్లీ మ్యాచ్​లంటే ప్రతి ఒక్కరూ విమర్శలకు దిగుతారు. ఒకవేళ కరోనా సిచ్యువేషన్​ బాగా మెరుగుపడితే అప్పుడు ట్రై చేయొచ్చు. కానీ ఇప్పట్లో అది కష్టంగానే కనిపిస్తున్నది. దీనికితోడు స్వదేశాలకు వెళ్లిపోయిన ఫారిన్​ క్రికెటర్లు మళ్లీ ఇండియాకు రావడానికి ఇష్టపడకపోవచ్చు. ఓవర్​సీస్​ క్రికెటర్లు లేకుంటే ఐపీఎల్​ కళ తప్పుతుంది. ముస్తాక్​ అలీ టీ20 టోర్నీ మాదిరిగా అయిపోతుంది. అప్పుడు లీగ్​కు ఉన్న ప్రతిష్ట మసకబారుతుంది. కాబట్టి ఇండియాలో ఇప్పటికిప్పుడు లీగ్​ అంటే కష్టమే. ‘ఈ సిచ్యువేషన్​లో ఇండియాలో లీగ్​ను కొనసాగించడం కష్టమే. కానీ ఓవర్​సీస్​లో మ్యాచ్​లకు ఒకటి, రెండు ప్రపోజల్స్​ వచ్చాయి. వాటికి అనుగుణంగా బీసీసీఐ రెడీ అయిపోతే సరిపోతుంది’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఒకవేళ బోర్డు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే బీసీసీఐ ముందు మూడు అప్షన్లు ఉన్నాయి.
మళ్లీ యూఈఏకి తరలించడం.
 ఇప్పటికే ఓసారి మెగాలీగ్​కు సక్సెస్​ఫుల్​గా ఆతిథ్యమిచ్చిన  ప్లేస్​ ఇది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇండియాలో టీ20 వరల్డ్​కప్​ కూడా కష్టమేనని సందేహాలు వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే ముందు ఐపీఎల్​, ఆ తర్వాత టీ20 వరల్డ్​కప్​.. ఇలా రెండింటిని సక్సెస్​ఫుల్​గా కంప్లీట్​ చేయొచ్చు. సెప్టెంబర్​ 14తో ఇంగ్లండ్​లో ఇండియా టూర్​ ముగుస్తుంది. అక్కడి నుంచే నేరుగా యూఏఈ వెళ్లి ఓ వారం పాటు క్వారంటైన్​లో ఉంటే సరిపోతుంది. అక్టోబర్​ 22న వరల్డ్​కప్ స్టార్ట్​ అయ్యే వరకు మిగతా 31 ఐపీఎల్​ మ్యాచ్​లను పూర్తి చేసుకోవచ్చు. ‘వరల్డ్​కప్​ను కూడా యూఏఈకి  షిఫ్ట్​ చేస్తే.. షెడ్యూల్​ను కంప్లీట్​ మార్చేయాల్సిందే’ అని సదరు అధికారి పేర్కొన్నాడు. అయితే అరబ్​ గడ్డపై సెప్టెంబర్​లో ఐపీఎల్​ను కొనసాగించడానికి ఉన్న ఒకే సమస్య.. వెదర్​. ఆ నెలలో అక్కడ బాగా వేడిగా ఉంటుంది. అక్టోబర్​ నుంచి కూల్​గా ఉంటుంది. 
యూకేకు తీసుకెళ్లడం
టీ20 వరల్డ్​కప్​ను యూఏఈకి షిఫ్ట్​ చేస్తే.. ఐపీఎల్​కు యూకే అత్యంత అనువైన ప్లేస్​. సరిగ్గా సెప్టెంబర్​తో ఇంగ్లిష్​ సమ్మర్​ ముగుస్తుంది. సెప్టెంబర్​, అక్టోబర్​ మధ్యలో ఐపీఎల్​ను పూర్తి​ చేసుకోవచ్చు. వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ ఫైనల్స్​ కోసం ఇండియా ఎలాగూ వచ్చే నెల​ ఇంగ్లండ్​ వెళ్తుంది. ఆ తర్వాత ఐదు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​ ఆడుతుంది. ఆ వెంటనే ఐపీఎల్​ను కంప్లీట్​ చేసుకుని వరల్డ్​కప్​ కోసం యూఏఈకి వెళ్తే సరిపోతుంది. ‘ఆ టైమ్​లో వెదర్​ కూడా బాగుంటుంది. బ్రాడ్​కాస్టర్స్​కు కూడా అనువైన టైమ్​ లభిస్తుంది. ఓవర్​సీస్​ ప్లేయర్ల ట్రావెలింగ్​కు కూడా మంచి టైమ్​ లభిస్తుంది. ప్లేయర్లు కూడా ఇంగ్లండ్​ రావడానికి ఇంట్రెస్ట్​ చూపిస్తారు. అక్కడి నుంచి ప్లేయర్లందరూ నేరుగా యూఏఈకి వెళ్తారు’అని ఆ అధికారి తెలిపారు. 
ఆసీస్​లో ట్రై చేయడం.. 
ఒకవేళ టీ20 వరల్డ్​కప్​ను ఆస్ట్రేలియాలో నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరిస్తే, అదే టైమ్​లో ఆసీస్​ గవర్నమెంట్​ రూల్స్​ను సడలిస్తే.. రెండు టోర్నీలను కంగారూల గడ్డపై ఏర్పాటు చేయొచ్చు. ఆసీస్​లో జరగాల్సిన 2022  టీ20 వరల్డ్​కప్​ను ఇండియాలో నిర్వహిస్తే సరిపోతుంది. ‘ఆసీస్​ గవర్నమెంట్​ పర్మిషన్​ ఇస్తే ఎక్స్​చేంజ్​కు క్రికెట్​ ఆస్ట్రేలియా పెద్దగా ఇబ్బందిపెట్టకపోవచ్చు. ఎలాగూ ఇంటర్నేషనల్​ ప్లేయర్లందరూ ఆసీస్​కు వస్తారు. ఇండియన్​ టైమింగ్​కు పెర్త్​ మూడున్నర గంటలు ముందుంటుంది. కాబట్టి ఇండియన్​ ప్రైమ్​ టైమ్​లోనే ఐపీఎల్​ మ్యాచ్​లను కంప్లీట్​ చేసుకోవచ్చు. అయితే ఆసీస్​ గవర్నమెంట్​ రూల్స్​ ను సడలించి, బ్రాడ్​కాస్టర్స్​ ఒప్పుకుంటేనే ఈ ఆప్షన్​ పనికొస్తుంది’ అని బోర్డు వర్గాలు​ చెబుతున్నాయి. కొత్త డెస్టినేషన్​లో లీగ్​ను నిర్వహించడం వల్ల ఫ్రెష్​నెస్​తో పాటు వ్యూయర్​షిప్​ను కూడా పెంచుకునే చాన్స్​ ఉంటుందని ఇండస్ర్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ రకంగా చూస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​ బెస్ట్​ ఆప్షన్స్​ అని చెప్పాయి. 

ఐపీఎల్​–14 వాయిదా పడి మూడు రోజులు కూడా కాలేదు..! చాలా మంది ఫారిన్, ఇండియా​ క్రికెటర్లు ఇంకా ఇళ్లకు కూడా చేరలేదు..! కానీ అప్పుడే సెకండ్​ పేజ్​ మ్యాచ్ ల నిర్వహణపై చర్చ మొదలైంది..! కరోనా నేపథ్యంలో ఇండియాలో  లీగ్​ను కొనసాగించడం కష్టమని తేలడంతో.. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా రేస్​లోకి వచ్చేశాయ్​..! కాసులు కురిపించే లీగ్​ కావడంతో ఇంగ్లిష్​  కౌంటీలు కూడా హోస్టింగ్స్​కు మొగ్గు చూపుతున్నాయి..! అన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్​లో విండో దొరుకుతుందని ఆశాభావంతో ఉన్న బీసీసీఐకి ఇది ఓ రకంగా బూస్టింగ్​ ఇచ్చే అంశమే అయినా.. మెగా లీగ్​ ఫ్యూచర్​ను బోర్డు ఎలా డిసైడ్​ చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది..!!
ఎంసీసీ, సర్రే, వార్విక్​షైర్​, లాంక్​షైర్​ క్లబ్స్​ ఆఫర్​..
లార్డ్స్​ స్టేడియం బేస్​గా ఉన్న ఇంగ్లిష్​ కౌంటీలు ఎంసీసీ, సర్రే, వార్విక్​షైర్​, లాంక్​షైర్​ కూడా ఐపీఎల్​ హోస్టింగ్​ ఆఫర్​ ఇచ్చాయి. కియా ఓవల్ (లండన్​)​, ఎడ్జ్​బాస్టన్ (బర్మింగ్​హామ్​)​, ఎమిరైట్స్​ ఓల్డ్​ ట్రాఫోర్డ్​ (మాంచెస్టర్​) గ్రౌండ్స్​ వీళ్ల ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ మేరకు నాలుగు కౌంటీలు ఈసీబీకి లెటర్​ రాశాయి. సెప్టెంబర్​ సెకండ్​ వీక్​లో ఐపీఎల్​ను కంప్లీట్​​ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. టీ20 వరల్డ్​కప్​కు ముందు టాప్​ క్లాస్​ క్రికెటర్లకు ఈ లీగ్​ ఉపయోగపడుతుందని కౌంటీస్​ వెల్లడించాయి.