IPL : హోమ్‌‌‌‌, అవే ఫార్మాట్‌‌‌‌లోకి ఐపీఎల్

IPL : హోమ్‌‌‌‌, అవే ఫార్మాట్‌‌‌‌లోకి ఐపీఎల్

న్యూఢిల్లీ:  ఐపీఎల్‌‌‌‌ మళ్లీ ఇంటా, బయట (హోమ్‌‌‌‌, అవే) ఫార్మాట్‌‌‌‌లోకి వచ్చేసింది. మెగా లీగ్‌‌‌‌16వ సీజన్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మార్చి 31 నుంచి మే28 వరకు కొత్త సీజన్‌‌‌‌ జరగనుంది. గత సీజన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌‌‌, చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ మధ్య తొలి పోరుతో లీగ్‌‌‌‌కు తెరలేవనుంది. లీగ్‌‌‌‌ దశలో 70 మ్యాచ్‌‌‌‌లు 12 సిటీల్లో 52 రోజుల పాటు జరగనున్నాయి.  ఏప్రిల్‌‌‌‌2న ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌తో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ తన తొలి మ్యాచ్‌‌‌‌లో పోటీ పడుతుంది. ఈ సీజన్‌‌‌‌లో 18 డబుల్‌‌‌‌ హెడర్స్‌‌‌‌ (ఒకే రోజు2 మ్యాచ్‌‌‌‌లు) ఉన్నాయి. లీగ్‌‌‌‌లో పది జట్లు ఉన్నప్పటికీ బోర్డు రెండు అదనపు వేదికలుగా గువాహతి, ధర్మశాలకు అవకాశం ఇచ్చింది. రాజస్తాన్‌‌‌‌ తమ తొలి రెండు హోమ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లను గువాహతిలో ఆడి తర్వాత జైపూర్‌‌‌‌కు షిఫ్ట్‌‌‌‌ అవుతుంది. పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ తొలి ఐదు హోమ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లను మొహాలీలో ఆడి.. చివరి రెండు హోమ్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ను ధర్మశాలలో ఆడనుంది.ప్లే ఆఫ్స్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ను బోర్డు తర్వాత ప్రకటించనుంది.మునుపటి మాదిరిగా  ప్రతీ టీమ్‌‌‌‌ సొంత గడ్డపై 7 హోమ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు, ఇతర సిటీల్లో 7 అవే మ్యాచ్‌‌‌‌లు ఆడుతుంది.