ముంబై క్యాంప్‌లో కరోనా అలజడి

ముంబై క్యాంప్‌లో కరోనా అలజడి
  • ఫ్రాంచైజీ బబుల్‌లో ఉన్న కిరణ్ మోరేకు పాజిటివ్
  • జట్టులో ఆటగాళ్లు, మిగతా సిబ్బందికి నెగెటివ్ 


ముంబై: ఐపీఎల్ 14వ సీజన్కు టైమ్ దగ్గరపడుతున్న వేళ  కరోనా కేసులు అందరినీ కలవర పెడుతున్నాయి. తాజాగా ఇండియా మాజీ వికెట్ కీపర్, ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్గా పని చేస్తున్న కిరణ్ మోరే పాజిటివ్గా తేలాడు. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది. 55 ఏళ్ల మోరే ముంబై టీమ్కు వికెట్ కీపింగ్ కన్సల్టంట్గా కూడా పని చేస్తున్నాడు. అతనికి ఎలాంటి సింప్టమ్స్ లేవని, బీసీసీఐ గైడ్లైన్స్ ప్రకారం ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంచినట్టు ముంబై ఫ్రాంచైజీ తెలిపింది. ఆ టీమ్ బయో బబుల్లో ఉన్న మోరేకు కరోనా సోకడంతో అంతా కంగారు పడ్డారు. అయితే, ముంబై టీమ్లోని   ప్లేయర్లు, ఇతర కోచింగ్ స్టాఫ్కు చేసిన పరీక్షల్లో అందరికీ నెగెటివ్ రిజల్ట్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.  ముంబై ప్రస్తుతం చెన్నైలో ప్రాక్టీస్ చేస్తోంది.  మరోవైపు ముంబై వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురు పాజిటివ్గా తేలారు. ఇందులో ఇద్దరు గ్రౌండ్ స్టాఫ్ కాగా, ఒకరు ప్లంబర్ అని ముంబై క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. వాంఖడేలో ఇప్పటికే పది మంది గ్రౌండ్ స్టాఫ్, ఏడుగురు ఈవెంట్ ఆర్గనైజర్స్కు వైరస్ సోకింది.  
ఆర్సీబీ ఓపెనర్ పడిక్కల్కు నెగెటివ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యంగ్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ కరోనా నుంచి కోలుకున్నాడు. ఆర్సీబీ టీమ్లో జాయిన్ అయ్యేముందు గతనెల 22న నిర్వహించిన టెస్టుల్లో అతను పాజిటివ్గా తేలాడు. అప్పటి నుంచి పడిక్కల్ హోమ్ క్వారంటైన్లో ఉంటున్నాడు. అయితే, తాజాగా చేసిన టెస్ట్లో అతనికి నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. టీమ్లో జాయిన్ అయ్యాక వారం రోజుల క్వారంటైన్లో ఉండాల్సిందే కాబట్టి  9వ తేదీన ముంబైతో జరిగే ఓపెనింగ్ మ్యాచ్కు అతను దూరం కానున్నాడు.  ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా పాజిటివ్గా తేలిన సంగతి తెలిసిందే.