IPL 2023: రస పట్టుగా ప్లే ఆఫ్ రేస్.. మిగతా మూడు జట్లేవి?

IPL 2023: రస పట్టుగా ప్లే ఆఫ్ రేస్.. మిగతా మూడు జట్లేవి?

ఐపీఎల్ ఈ సారి ప్లే ఆఫ్ రేసు ఇంట్రెస్టింగ్ గా మారింది.  దాదాపు లీగ్ దశ పూర్తవుతున్నా ప్లే ఆఫ్ కు వెళ్లే ఇంకో మూడు జట్లు ఏవో తేలలేదు. 18 పాయింట్లతో    గుజరాత్ టైటాన్స్ ఒక్కటే  ప్లేఆఫ్ ను కన్ఫార్మ్ చేసుకుంది. అయితే మిగతా మూడు జట్లేవి అనేది లీగ్ దశ మొత్తం పూర్తయితే కానీ తేలని పరిస్థితి.

ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో   రెండో ప్లేసులో  ఉన్న  చెన్నై  లీగ్ లో ఇంకో మ్యాచ్ ఆడితే కానీ చెన్నై ప్లే ఆఫ్ పై ఓ క్లారిటీ రాదు. చెన్నై సూపర్ కింగ్స్  ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్  తో తలపడనుంది. ఇవాళ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే డైరెక్ట్ గా 17 పాయింట్లతో రెండో ప్లేస్ కు చేరుకోవడమే గాకుండా మిగతా జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఒక వేళ ఢిల్లీతో ఓడితే చెన్నై ఆదివారం  మ్యాచ్ లు పూర్తయ్య వరకు వేచి చూడాలి.

 ఇక మరో జట్టు  లక్నో సూపర్ జాయింట్ ది ఇదే పరిస్థితి 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న  ఈ జట్టు ఇవాళసాయంత్రం కోల్ కతాతో ఢీ కొననుంది. ఈ మ్యాచ్ లో లక్నో గెలిస్తే మిగతా జట్లతో సంబందం లేకుండా ప్లే ఆఫ్ కు వెళ్తుంది.  అంటే ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో చెన్నై, కోల్ కతాతో జరిగే మ్యాచ్ లో లక్నో గెలిస్తే రెండు, మూడు స్థానాల్లో  ప్లే ఆఫ్ బెర్తులు కన్ఫర్మ్ అన్నమాట. 

ఇక మిగిలి నాల్గో స్థానం కోసమే మిగతా జట్లు ముబై,రాజస్థాన్, బెంగళూరు మద్య తీవ్ర పోటీ ఉంది. బెంగళూరు తన లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో ఆదివారం ఢీ కొననుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓడిన పెద్ద నష్టం ఏం లేదు కానీ.. బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్ లో గెలిస్తే 16 పాయింట్లతో బెంగళూరు నాల్గో స్థానంలో ఉంటుంది. అయితే ముంబై కూడా తన చివరి మ్యాచ్ హైదరాబాద్ తో ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్ లో ముంబై గెలిస్తే  ఏ జట్టుకైతే రన్ రేట్ ఎక్కువా ఉంటుందో ఆ జట్టు ఫోర్త్ ప్లేసుకు వెళ్తుంది.  అంటే ఫోర్త్ ప్లేస్ కు ముంబై, బెంగళూరు మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సి ఏంటంటే.. ముంబై, హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో అధిక రన్ రేటుతో గెలిస్తేనే ప్లే ఆఫ్ కు వెళ్లే చాన్స్ ఉంటుంది .ఒక వేళ బెంగళూరు తన చివరి మ్యాచ్ లో ఓడి...ముంబై గెలిస్తే 16 పాయింట్లతో ఫోర్త్ ప్లేసును కన్ఫర్మ్ చేసుకుంటుంది.  ఇక బెంగళూరు, ముంబై తమ చివరి మ్యాచ్ లో ఓడితే  రాజస్థాన్ కూడా 14 పాయింట్లతో మూడు జట్లు  సమానంగా ఉంటాయి. కానీ రన్ రేట్ ఆధారంగా ఒక్క జట్టు ప్లే ఆఫ్ కు వెళ్తుంది.